చిరకాలంగా వినిపిస్తున్న గ్యాసిప్ లే నిజమయ్యాయి. నటి పవిత్ర, సీనియర్ హీరో, నటుడు నరేష్ పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని నరేష్ నే స్వయంగా ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఒక వీడియో పోస్ట్ చేసారు.
కేక్ చుట్టూ దీపాలు వెలిగించి, నరేష్-పవిత్ర సాన్నిహిత్యంగా వచ్చి, ఒకరి పెదవలు మరొకరు సుతారంగా ముద్దాడిన వీడియో ఇది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం అనే ముగింపు ఇచ్చారు ఈ వీడియోకి.
నరేష్ కు గతంలోనే ఒకటి రెండు పెళ్లిళ్లు అయ్యాయి. కానీ నిలవలేదు. దాదాపు ఏడాది కాలంగా పవిత్ర-నరేష్ సాన్నిహిత్యంగా వుంటూ వస్తున్నారు. వీరి సహజీవనం మీద అనేక వార్తలు, కథనాలు వచ్చాయి. దీని మీద నరేష్ మాజీ భార్య వచ్చి గొడవ చేసిన సంఘటన కూడా జరిగింది. ఈ నేపథ్యంలో పలు యూ ట్యూబ్ చానెళ్ల మీద, సోషల్ మీడియా హ్యాండిళ్ల మీద పవిత్ర సైబర్ క్రయిమ్ విభాగానికి ఫిర్యాదు కూడా చేసారు.
ఆఖరికి ఇప్పుడు ఆ ఇద్దరే తమ పెళ్లి వార్తను ఖరారు చేసారు. ఇక ఏ గ్యాసిప్ లు, విడియోలు గొడవే వుండదు. ఆల్ ది బెస్ట్ పవిత్ర-నరేష్.