2022లో చాలామంది సినీ సెలబ్రిటీలు పెళ్ళిళ్లు చేసుకున్నారు. అలియాభట్ అయితే ఏకంగా ఒకే ఏడాదిలో పెళ్లి చేసుకొని, బిడ్డకు జన్మనిచ్చి తల్లి కూడా అయింది. మరి కొత్త ఏడాది సంగతేంటి?
న్యూ ఇయర్ లో కూడా పెళ్లి ముచ్చట్లు షురూ అయ్యాయి. ఈ ఏడాది బాలీవుడ్ నుంచి కియరా అద్వానీ రెడీ అయింది. బాలీవుడ్ తారలు కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లి వార్తలు కొత్తవేం కావు. కాకపోతే ఈసారి మరింత గట్టిగా వినిపిస్తున్నాయి. త్వరలోనే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారట. అది కూడా రాజస్థాన్ లోని ఓ కోటలో.
ఇంతకుముందు కత్రినాకైఫ్-విక్కీ కౌశల్ కూడా ఇలానే రాజస్థాన్ లోని ఓ కోటలో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు కియరా-సిద్దార్థ్ కూడా అదే టైపులో పెళ్లి చేసుకుంటారట.
జైసల్మేర్ లోని ఓ ప్యాలెస్ లో ఫిబ్రవరి 6న కియరా అద్వాని-సిద్దార్థ్ మల్హోత్రా పెళ్లి చేసుకోబోతున్నారు. కోటలో 4వ తేదీ నుంచి పెళ్లి వేడుకలు షురూ అవుతాయి. ఈ మేటర్ పై ఇటు సిద్దార్థ్, అటు కియరా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ, ఇది ఆల్ మోస్ట్ ఫిక్స్ అని తెలుస్తోంది.
ఎందుకంటే.. వీళ్లిద్దరూ కలిసి తమ క్లోజ్ ఫ్రెండ్స్ కు ఈరోజు పార్టీ ఇస్తున్నారు. అది కేవలం న్యూ ఇయర్ పార్టీ మాత్రమే కాదు, దాదాపు ప్రీ-వెడ్డింగ్ పార్టీ కూడా. అలా ఈ మేటర్ బయటకొచ్చింది. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో కియరా హీరోయిన్ గా నటిస్తోంది.