Advertisement

Advertisement


Home > Movies - Movie News

అలీపై ప‌వ‌న్ గుర్రు

అలీపై ప‌వ‌న్ గుర్రు

అగ్ర‌హీరో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ టాలీవుడ్ ప్ర‌ముఖ క‌మెడియ‌న్ అలీపై ఇంకా గుర్రుగానే ఉన్నార‌ని తెలుస్తోంది. అలీ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పిన మాట‌ల ఆధారంగా ఈ నిర్ధార‌ణ‌కు రావాల్సి వ‌స్తోంది. అలీపై ప‌వ‌న్ కోపంగా ఉన్నార‌నేందుకు ప్ర‌తి ఏడాది ఆన‌వాయితీ ప్ర‌కారం పంపే సేంద్రీయ మామిడి పండ్ల‌ను పంప‌క‌పోవ‌డ‌మ‌నే నిద‌ర్శ‌నంగా చెప్పుకోవ‌చ్చు.

పవన్ కల్యాణ్, అలీ మంచి స్నేహితుల‌నే విష‌యం తెలిసిందే. అయితే రాజ‌కీయాల్లోకి వ‌చ్చేస‌రికి మాత్రం త‌మ ఇద్ద‌రి దారులు వేరంటున్నారు. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా అలీ వైసీపీలో చేర‌డం, ఆ పార్టీ త‌ర‌పున విస్తృతంగా ప్ర‌చారం చేయ‌డం తెలిసిందే. అప్ప‌ట్లో ఇద్ద‌రి మ‌ధ్య కొంత గ్యాప్ కూడా పెరిగింది.

ఎన్నిక‌ల్లో అలీ మ‌ద్ద‌తు ప‌లికిన వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత పవన్‌పై ఏ సంద‌ర్భంలోనూ అలీ నోరు మెద‌ప‌లేదు.  లాక్‌డౌన్ సందర్భంగా అలీ కొన్నిచానెల్స్‌లో, సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న అభిప్రాయాల‌ను పంచుకుంటూ అభిమానులకి వినోదం పంచుతున్నారు.  ఎవ‌రికీ తెలియ‌ని కొత్త సంగ‌తుల‌ను చెబుతున్నారు. ఈ సంద‌ర్భంగా కొన్ని ఇంట‌ర్వ్యూల్లో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గురించి ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ గురించి అలీ ఏమ‌న్నారంటే...

‘పవన్‌కు నేనంటే చాలా ఇష్టం. నా కామెడీ అన్నా, హావభావాలు అన్నా ఆయన బాగా ఇష్టపడతారు. మేము ఏదైనా స్టేజ్ మీద ఉన్నప్పుడు సీక్రెట్‌గా సైగలు చేసుకుంటూ ఉంటాం. ఆ సైగలు ఎవ్వరికీ తెలియవు. దాదాపు ఆయన నటించిన అన్ని చిత్రాలలో నేను నటించాను. అన్నయ్య చిరంజీవి కోసం వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు కళ్యాణ్‌ ఆప్యాయంగా పలకరించేవారు. ‘తొలిప్రేమ’ చిత్రం నుంచి మా మధ్య అనుబంధం బాగా బలపడింది. ప్రతి సంవత్సరం అన్నయ్య చిరంజీవి ఆవకాయ పచ్చడి పంపిస్తారు. పవన్ కల్యాణ్‌ సేంద్రీయ పద్ధతులలో పండించిన మ్యాంగోస్ పంపుతారు. కానీ ఈ సంవత్సరం ఆయన రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల పంపలేదు. వచ్చే సంవత్సరం పంపుతారని అనుకుంటున్నాను’ అని అలీ చెప్పుకొచ్చారు.

గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌పై అలీ చేసిన విమ‌ర్శ‌ల‌ను మ‌న‌సులో పెట్టుకున్న‌ట్టుంది. అందుకే అలీకి ప్ర‌తి ఏడాది ఆన‌వాయితీగా పంపే మామిడి పండ్ల‌ను పంప‌లేద‌ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తానికి అలీపై ప‌వ‌న్ ఇంకా గుర్రుగానే ఉన్నార‌న్న మాట‌.

తిట్టే వాళ్ళకే ఎక్కువ పెట్టాలి

నువ్వు ఎంత మొత్తుకున్నా నీ మాటలు నమ్మరు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?