జూన్ 19న రాజ్యసభ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఓటింగ్ ను చేపట్టనున్నట్టుగా ఇప్పటికే ప్రకటించింది ఎన్నికల కమిషన్. ఈ పాటికే రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాల్సింది. అయితే కరోనా లాక్ డౌన్ ఫలితంగా రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ వాయిదా పడింది. ఈ క్రమంలో జూన్ 19న ఆ ఎన్నికలను నిర్వహించనున్నట్టుగా ఈసీ ప్రకటించింది.
ఏపీకి సంబంధించి కూడా నలుగురు రాజ్యసభ సభ్యులు ఎన్నిక కావాల్సి ఉంది. ఇప్పటికే అందుకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తి అయ్యింది. అసెంబ్లీ కోటాలో జరిగే ఈ ఎన్నికలకు సంబంధించి, బలాబలాలను బట్టి నాలుగు సీట్లూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతమే అవుతాయి. 23 మంది ఎమ్మెల్యేల బలాన్ని కలిగి ఉన్న తెలుగుదేశం పార్టీ కనీసం ఒక్క రాజ్యసభ సీటును కూడా పొందే అవకాశం లేదు.
అయినా కూడా తెలుగుదేశం పార్టీ కావాలని వర్ల రామయ్య చేత నామినేషన్ వేయించింది. చంద్రబాబుకు ఇలాంటి తతంగాలు అలవాటే అనే సంగతి తెలిసిందే. గెలవలేని సీటుకు దళితుడి చేత నామినేషన్ వేయించి, ఏదో రాజకీయం చేయాలనే చీప్ ట్రిక్స్ ను చంద్రబాబు నాయుడు ఆపడం లేదు. టీడీపీకి రాజ్యసభ సీటు దక్కేట్టు అయితే అది ఏ కమ్మ వ్యక్తికో, మరో కోటీశ్వరుడికో దక్కేది. ఎలాగూ ఓడిపోయే సీటు కాబట్టి దళితుడి చేత నామినేషన్ వేయించే ఒక నీఛ రాజకీయాన్ని చంద్రబాబు నాయుడు అమలు చేస్తూ ఉన్నారు.
చంద్రబాబు నాయుడి థర్డ్ గ్రేడ్ రాజకీయం వల్ల ఇప్పుడు ఏపీ అసెంబ్లీ సమావేశం నిర్వహించాల్సి వచ్చేలా ఉంది. టీడీపీ తరఫు నామినేషన్ వల్ల ఓటింగ్ తప్పనిసరి కానుంది, లేకపోతే ఏకగ్రీవంగా లాంఛనం పూర్తయ్యేది. మామూలుగా అయితే అసెంబ్లీ సమావేశం అయినా పెద్ద నష్టం లేదు. అయితే కరోనా కష్టాల వేళ ఇలాంటి తతంగాన్ని పెట్టారు తెలుగుదేశం వాళ్లు. టీడీపీ అభ్యర్థి గెలిచేదీ లేదు, ఏమీ లేదు కానీ.. వీలైనంత తక్కువ ప్రయాణాలు చేయాల్సిన సమయంలో చంద్రబాబు దివాళాకోరు రాజకీయం వల్ల సభ సమావేశం కావాల్సి ఉంది.