Advertisement

Advertisement


Home > Movies - Movie News

పెద్ద‌న్న మెగాస్టార్‌కు త‌మ్ముడి జేజేలు

పెద్ద‌న్న మెగాస్టార్‌కు త‌మ్ముడి జేజేలు

త‌న పెద్ద‌న్న‌, మెగాస్టార్ చిరంజీవికి ప‌వ‌ర్‌స్టార్ అయిన త‌మ్ముడు ప‌వ‌న్‌క‌ల్యాన్ జేజేలు ప‌లుకుతున్నాడు. అన్న ద‌యార్ద్ర హృద‌యాన్ని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతున్నాడు. అలాగే క‌రోనా విప‌త్తును ఎదుర్కొనేందుకు ఆర్థిక సాయం ప్ర‌క‌టించిన‌, అందించిన ప్ర‌తి ఒక్క హీరోకి, సినీ సంబంధిత వ్య‌క్తికి ప‌వ‌న్ పేరుపేరునా కృత‌జ్ఞ‌తలు చెబుతున్నాడు.

క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డానికి ప్ర‌ధాని మోడీ దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్ర‌కటించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో  సినీ కార్మికుల కోసం ప్రముఖ నటుడు చిరంజీవి రూ. కోటి విరాళంగా ప్రకటించడంపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ హర్షం వ్యక్తం చేశాడు.

సినిమా ప‌రిశ్ర‌మ క‌ష్టాల్లో ఉన్న స‌మ‌యంలో ఆప‌ద్బాంధ‌వుడిలా ఆదుకునేందుకు వెంట‌నే ముందుకొచ్చిన త‌న అన్న చిరంజీవి సినీ కార్మికుల కోసం రూ.కోటి విరాళంగా ప్ర‌క‌టించినందుకు త‌మ్ముడిగా గ‌ర్వ‌ప‌డుతున్న‌ట్టు ప‌వ‌న్ ట్విట‌ర్‌లో ప్ర‌క‌టించాడు.

'సినీ పరిశ్రమలోని 24 విభాగాలలోని ప్రతీ టెక్నీషియన్‌, ప్రతీ కార్మికుని శ్రమ తెలిసిన వ్యక్తి చిరంజీవి. కరోనా దెబ్బతో ఉపాధి కోల్పోయి సినిమానే నమ్ముకుని జీవిస్తున్న ఎందరో కార్మికులు, టెక్నీషియ‌న్లు ఆర్థికంగా అల్లాడిపోతున్నారు. అలాంటి అభాగ్యుల‌ను  ఆదుకునేందుకు పెద్దన్నగా ముందుకొచ్చిన చిరంజీవికి కృతజ్ఞతలు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాలని నిర్ణయించుకున్న ఆయన దయార్ద్ర హృదయానికి జేజేలు పలుకుతున్నాను' అని ట్విట‌ర్‌లో ప‌వ‌న్ పేర్కొన్నాడు.

అన్న‌తో పాటు రూ. 4 కోట్లు విరాళంగా ఇచ్చిన బాహుబ‌లి ప్రభాస్‌, రూ. 1 కోటీ 25 లక్షలు విరాళంగా ఇచ్చిన అ‍ల్లు అర్జున్‌, కోటి రూపాయల విరాళం ఇచ్చిన మహేష్‌ బాబు, రూ. 75 లక్షలు ఇచ్చిన రామ్‌ చరణ్‌, రూ. 70 లక్షలు ఇచ్చిన జూనియర్‌ ఎన్టీఆర్‌, రూ. 20 లక్షలు  ఇచ్చిన నితిన్‌, త్రివిక్రమ్‌, దిల్‌ రాజు, రూ. 10 లక్షలు చొప్పున విరాళంగా ఇచ్చిన సాయి ధర్మ తేజ్‌, కొరటాల శివ, అనిల్‌ రావిపూడిలకు  పవన్ ప్ర‌త్యేక కృతజ్ఞతలు తెలిపాడు.

క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో త‌న వంతుగా ప‌వ‌న్ రూ.2 కోట్లు కేంద్రంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల‌కు అంద‌జేసి....సినీ ప‌రిశ్ర‌మ‌లోని హీరోల‌కు ఆద‌ర్శంగా, స్ఫూర్తిగా నిలిచాడు. త‌న‌లా విరాళాలు ప్ర‌క‌టించిన‌, అంద‌జేసిన వాళ్ల‌కు ప‌వ‌న్ కృత‌జ్ఞ‌త‌లు తెల‌ప‌డం అభినంద‌నీయం.

బన్నీ ఎంత ఇచ్చాడో తెలుసా

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?