మెగా హీరో సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ సినిమా విరూపాక్ష. ఇంట్రస్టింగ్ టైటిల్ మాత్రమే కాదు. ఇంట్రస్టింగ్ జానర్ కూడా. బైక్ యాక్సిండెంట్ తరువాత తేరుకుని, మళ్లీ యాక్టివ్ గా తయారైన సాయి ధరమ్ తేజ్ చేసిన తొలి సినిమా ఇది.
టాకీ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది ఏప్రిల్ మూడో వారంలో విడుదల డేట్ కూడా ప్రకటించారు. ఇప్పుడు ట్రయిలర్ ను విడుదల చేయబోతున్నారు.
మార్చి 1న ట్రయిలర్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విడుదల చేస్తారు. ప్రస్తుతం పవన్ తో కలిసే షూటింగ్ లో వున్నారు సాయిధరమ్ తేజ్. వినోదయసితం రీమేక్ లో మేనమామ పవన్ తో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే.
విరూపాక్ష సినిమాలో సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తోంది. చిత్రానికి సమర్పణ సుకుమార్ రైటింగ్స్. దర్శకుడు కార్తీక్ దండు. నిర్మాత భోగవిల్లిప్రసాద్.