మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కల్యాణ్ ఫిలింసిటీలో హంగామా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు అన్నదమ్ముల సినిమాలు రామోజీ ఫిలింసిటీలో ఏకకాలంలో సాగుతున్నాయి.
చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య షూటింగ్ ఫిలింసిటీలో శరవేగంగా నడుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి-రవితేజ మధ్య కొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్నారు. ఈరోజు, రేపటితో ఈ పార్ట్ కంప్లీట్ అవుతుంది.
అప్పటికి వాల్తేరు వీరయ్య టాకీ పార్ట్ పూర్తవుతుంది. ఇక మిగిలిన ఒక్క పాట కోసం విదేశాలకు వెళ్లాలని అనుకుంటున్నారు. విదేశాల్లో చిరంజీవి-శృతిహాసన్ మధ్య ఓ డ్యూయట్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో వాల్తేరు వీరయ్య షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.
అటు పవన్ కల్యాణ్ కూడా రామోజీ ఫిలింసిటీలోనే ఉన్నాడు. వంద మంది జూనియర్ ఆర్టిస్టులు, ఫైటర్లతో కలిసి ఓ యాక్షన్ ఎపిసోడ్ లో నటిస్తున్నాడు. సినిమాలో ఇంటర్వెల్ కు ముందు వచ్చే ఫైట్ ఇది. ఈ షూటింగ్ మరో వారం, పది రోజులు ఉండొచ్చు.
ఇదే షూటింగ్ లో వీరమల్లు గెటప్ లో ఖరీదైన బైక్ పై లొకేషన్ లో పవన్ కల్యాణ్ చక్కర్లు కొడుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలా మెగా అన్నదమ్ములిద్దరూ ఒకే చోట తమ సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు.