ఈ మధ్య ఎక్కడ చూసినా, ఎప్పుడు చూసినా రాజకీయాలు తప్ప మరో మాట మాట్లాడని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల గురించి కూడా మాట్లాడారు.
అవెంజర్స్ సినిమా గురించి వివరంగా చెప్పి, అందులోని థామస్ పాత్ర పేరు సిఎమ్ జగన్ కు పెట్టారు. ఎందుకంటే జగన్ అనే పేరు పలకడం ఆయనకు ఇష్టం లేదంట..అదెందుకో..అంత పాపం జగన్ ఏమి మూట కట్టుకున్నాడో. సరే ఆ సంగతి అలా వుంచితే తెలుగు సినిమాల గురించి కూడా మాట్లాడారు. సినిమా రంగం ఏ ఒక్కరి సొత్తు కాదన్నారు. మెగా హీరోల సొత్తు అసలే కాదన్నారు.
మార్పు వస్తోందని, రావాలని పవన్ అన్నారు. కార్తికేయ 2 సినిమా హిట్ కావడం, నిఖిల్ అనే హీరో రావడం మార్పుకు చిహ్నాలు అన్నారు. పాపం పవన్ కు తెలిసి వుండకపోవచ్చు. నిఖిల్ అనే హీరో ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లయింది. అది సరే, కార్తికేయ 2 సినిమా గురించి, దాని సక్సెస్ గురించి మాట్లాడిన పవన్ సీతారామం, బింబిసార ల గురించి కూడా మాట్లాడి వుండొచ్చు కదా.
ఇక్కడ లాజిక్ ఏమిటంటే కార్తికేయ 2 నిర్మాతలు పవన్ ప్లస్ ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో సినిమా చేస్తున్నారు. అందుకోసం పవన్ భారీ అడ్వాన్స్ కూడా అందుకున్నారని బోగట్టా. పోనీ ఇప్పటికైనా ఏం పోయింది. నిఖిల్ ను తన సరసన పెట్టుకోమని, తన మేనల్లుడిని త్యాగం చేయమని పవన్ చెప్పవచ్చుగా. మార్పు రావాలి కదా?