పవన్ కల్యాణ్ కు తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో అభిమానులున్నారు. అయితే వీళ్లలో కొందరు పిచ్చి అభిమానులు కూడా ఉన్నారు. పవనిజం ముసుగులో శాడిస్టుల్లా ప్రవర్తిస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి ఆ కోవలోకే వస్తాడు. పవన్ అంటే పిచ్చి ఉన్న ఈ వ్యక్తి, చేయి కోసుకున్నాడు.
పవన్ కల్యాణ్ అంటే ఇష్టముంటే మొదటి రోజు సినిమా చూస్తారు. ఇంకా ఇష్టం ఉంటే 5-6 సార్లు అదే సినిమా చూస్తారు. అంతేతప్ప, బతుకు నాశనం చేసుకోరు. కానీ మదనపల్లికి చెందిన పవన్ అభిమాని మాత్రం చేయి కోసుకున్నాడు.
సినిమా ఎలా ఉందని అడిగే పాపానికి, బ్లేడ్ తో తన మోచేయిని 10-12 సార్లు తనివితీరా కోసుకున్నాడు ఈ శాడిస్ట్ అభిమాని. అక్కడితో ఆగకుండా, పవన్ కోసం తను రక్తం ధారపోస్తానంటూ స్టేట్ మెంట్ ఇచ్చాడు. పవన్ అడిగితే తన ప్రాణాలు ఇచ్చేస్తానని గట్టిగా అరిచాడు.
దీంతో మీడియా జనం ఖంగుతిన్నారు. బ్రో సినిమా ఎలా ఉందని అడిగిన పాపానికి అతడు చేయి కోసుకుంటాడని వీళ్లు ఊహించలేదు. ఏదైనా తేడా కొడితే, తమపై పోలీసు కేసు పడుతుందని భయపడ్డారు. వెంటనే అతడి చేతికి గుడ్డ కట్టి హాస్పిటల్ లో జాయిన్ చేశారు.
భారీ అంచనాల మధ్య రిలీజైంది బ్రో సినిమా. గత శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా కేవలం పవన్ ఫ్యాన్స్ కు మాత్రమే నచ్చింది. బ్రో సినిమా చూసి పవన్ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఆ అభిమానమే ఇలా హద్దులు దాటి ఈ వ్యక్తి చేయి కోసుకునే వరకు వెళ్లింది. ప్రస్తుతం ఇతడిపై కేసు నమోదు చేసే ఆలోచనలో ఉన్నారు పోలీసులు.