పవన్ కల్యాణ్ బతికిపోయాడు!

పవన్ చేస్తున్న సినిమాలతో పాటు, అతడు మిస్ అయిన సినిమాలపై అభిమానులు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చర్చావేదికలు నిర్వహిస్తుంటారు. ఇడియట్, పోకిరి లాంటి సినిమాలు ముందుగా పవన్ వద్దకే వచ్చిన విషయాన్ని పదే పదే…

పవన్ చేస్తున్న సినిమాలతో పాటు, అతడు మిస్ అయిన సినిమాలపై అభిమానులు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చర్చావేదికలు నిర్వహిస్తుంటారు. ఇడియట్, పోకిరి లాంటి సినిమాలు ముందుగా పవన్ వద్దకే వచ్చిన విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ బాధపడుతుంటారు. ఈ క్రమంలో పవన్ వదులుకొని, ఆ తర్వాత ఫ్లాప్ అయిన సినిమాల ప్రస్తావన కూడా వస్తుంది. ఇప్పుడీ లిస్ట్ లోకి గాడ్సే కూడా చేరింది.

సత్యదేవ్ హీరోగా నటించిన సినిమా గాడ్సే. గోపీగణేశ్ దర్శకత్వంలో నిన్న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ కథను పవన్ కల్యాణ్ ను దృష్టిలో పెట్టుకొని రాశాడట గోపీ గణేశ్. పవన్ కు వినిపించలేకపోయానని, పవన్ కూడా బిజీగా ఉండడం వల్ల సత్యదేవ్ తో సెట్స్ పైకి వచ్చానని ప్రమోషన్ లో చెప్పుకున్నాడు.

ఇప్పుడా టాపిక్ ను పవన్ ఫ్యాన్స్ ఎత్తుకున్నారు. గాడ్సే సినిమాను పవన్ కల్యాణ్ చేయకపోవడం మంచిదైందంటూ  సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాను నిజంగా పవన్ చేసినట్టయితే, అతడి కెరీర్ డిజాస్టర్లలో గాడ్సేనే మొదటి స్థానంలో నిలిచేదని మాట్లాడుకుంటున్నారు.

బ్లఫ్ మాస్టర్ లాంటి సక్సెస్ తర్వాత సత్యదేవ్-గోపి కలిసి చేసిన ఈ సినిమా ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయింది. చెప్పాల్సిన పాయింట్ ను గాలికొదిలేసి, డైలాగ్స్ తో కవర్ చేయాలని చూశారు. ప్రొడక్షన్ వాల్యూస్, కథనం, డైలాగ్స్.. ఇలా ఏ కోణంలోనూ ఈ సినిమా మెప్పించలేకపోయింది. అలా ఈ హిట్ కాంబినేషన్ కు గాడ్సేతో తెరపడింది.