సైరా పవన్: టీజర్ లోనే కాదు, సినిమాలో కూడా!

సైరా సినిమా ప్రమోషన్ లో భాగంగా పవన్ కల్యాణ్ ను రంగంలోకి దించిన విషయం తెలిసిందే. ఈ సినిమా టీజర్ కు పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. టీజర్ లో అది పెద్దగా…

సైరా సినిమా ప్రమోషన్ లో భాగంగా పవన్ కల్యాణ్ ను రంగంలోకి దించిన విషయం తెలిసిందే. ఈ సినిమా టీజర్ కు పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. టీజర్ లో అది పెద్దగా ఎలివేట్ అవ్వలేదనుకోండి. అది వేరే విషయం. అయితే టీజర్ తోనే పవన్ పాత్ర ముగిసిపోలేదు. సైరా సినిమాలో కూడా పవన్ గొంతు వినిపించనుంది. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి బయటపెట్టారు.

సైరా టీజర్ లాంఛ్ లో మాట్లాడిన చిరంజీవి.. సినిమాలో కూడా పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. అంతేకాదు.. మిగతా భాషల్లో కూడా కొంతమంది ప్రముఖులు వాయిస్ ఓవర్ చెప్పిన విషయాన్ని బయటపెట్టారు.

సైరా సినిమా తెలుగు వెర్షన్ కు పవన్ కల్యాణ్, తమిళ వెర్షన్ కు కమల్ హాసన్, మలయాళం వెర్షన్ కు మోహన్ లాల్ వాయిస్ ఓవర్ ఉంటుందని వెల్లడించారు. సినిమా ప్రారంభంలో, ముగింపులో మాత్రమే ఈ వాయిస్ ఓవర్లు వినిపిస్తాంటున్నారు. 

“తెలుగులో నా తమ్ముడు పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. కమల్ హాస్ ను ను రిక్వెస్ట్ చేశాను. ఆయన అంగీకరించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగాలేదు. త్వరలోనే ఆయన వాయిస్ ఓవర్ చెబుతారు. ఇక మోహన్ లాల్ కూడా వాయిస్ ఓవర్ ఇచ్చారు. సినిమా ప్రారంభంలో వచ్చే ఇంట్రడక్షన్, క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాల్లో ఈ స్టార్స్ వీళ్ల వాయిస్ ఓవర్లు ఉంటాయి.”

ఈ పదేళ్లలో ఫిలింమేకింగ్ చాలా మారిపోయిందన్న చిరంజీవి, మంచి కంటెంట్ దొరక్కపోవడం వల్ల బాలీవుడ్ లో రీఎంట్రీ ఇవ్వలేకపోయానంటున్నారు. సైరా సినిమాతో ఇన్నాళ్లకు మంచి కథ దొరికిందని, అందుకే బాలీవుడ్ లోకి మరోసారి వస్తున్నానని అన్నారు.

సైరా టీజర్ కోసం క్లిక్ చేయండి

జగన్ మేనమామపై అసంతృప్తి జ్వాలలు!