సాకర్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోపై వచ్చిన అత్యాచారం అభియోగాలు కొత్త మలుపు తీసుకున్నాయి. అమెరికాకు చెందిన ఒక మోడల్ రొనాల్డోపై అత్యాచారం ఆరోపణలు చేసింది. పదేళ్ల కిందట రొనాల్డో తనను అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది. ఈ మేరకు కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దానిపై విచారణ సాగుతూ ఉంది.
ఈ వ్యవహారం గురించి కొన్ని రోజులుగా కొన్ని పుకార్లు షికారు చేశాయి. మయోర్గా అనే ఆ మోడల్ కు అప్పట్లోనే రొనాల్డో భారీగా డబ్బులు ఇచ్చి వ్యవహారాన్ని సెటిల్ చేసుకున్నాడు అనేది ఆ సెటిల్మెంట్ సారాంశం. అయితే దాన్ని ఇన్నాళ్లూ పోర్చుగల్ సాకర్ ప్లేయర్ ఖండిస్తూ వచ్చాడు. అయితే తాజాగా రొనాల్డో లాయర్లు ఆ విషయాన్నే ధ్రువీకరించారు.
భారత ద్రవ్యమానంలో చెప్పాలంటే దాడాపు రెండు కోట్లా డెబ్బై ఐదు లక్షల రూపాయల సొమ్ము చెల్లించి రొనాల్డో ఆమెతో వ్యవహారాన్ని సెటిల్ చేసుకున్నాడని, అయితే అది నేరాన్ని ఒప్పుకోవడం కాదని వారు అంటున్నారు. ఆమె అతడిపై ఆరోపణలు చేయగా, అవి కల్పితమే అయినప్పటికీ… బహిరంగ ఆరోపణలు ఏవీ చేయకుండా రొనాల్డో ఆమెకు రెండు కోట్లా డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఇచ్చి.. ఒప్పందం చేసుకున్నాడని లాయర్లు అంటున్నారు.
అంత భారీగా డబ్బును తీసుకున్నా ఆమె ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని వారు కోర్టుకు తెలియజేశారు. అంతర్జాతీయ ప్రముఖులపై అత్యాచారం ఆరోపణలు రావడం కొత్త ఏమీకాదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వికీలీక్స్ వ్యవస్థాపకుడు అసాంజ్ తదితరులు కూడా ఈ తరహా ఆరోపణలు ఎదుర్కొన్నారు. కొందరు సెలబ్రిటీలు ఇలాంటి అభియోగాలతోనే చిత్తు అయ్యారు. ఈ కేసుతో ఈ సాకర్ మాంత్రికుడు కూడా ముప్పుతిప్పలు పడుతూ ఉన్నాడు!