హీరో పవన్ కళ్యాణ్ కు గీతా సంస్థ కింగ్ పిన్ బన్నీ వాస్ కు చాలా దోస్తానా. అది చాలా కాలంగా తెలిసిందే. చాలా ఏళ్ల క్రితం రాజమండ్రి లో పవన్ యాత్ర సాగించినపుడు ముందుగా అక్కడికి వెళ్లి అన్ని ఏర్పాట్లు చూసింది బన్నీ వాస్ నే.
2019లో పవన్ ఎన్నికల సమయంలో రెండు నెలల అక్కడే వుండిపోయి అన్ని ఏర్పాట్లు చూసుకున్నది, అన్న వ్యవహారాలు చక్కబెట్టింది బన్నీ వాస్ నే. అంతే కాదు జనసేన కోసం, పవన్ కోసం బన్నీ వాస్ పడ్డ కష్టం ఇంతా అంతా కాదు. ఇటు గీతా..బన్నీ మనిషి అయినా పవన్ అంటే బన్నీ వాస్ కు అంత ఇష్టం.
కానీ మరి ఇప్పుడు ఏమయిందో పవన్ తనంతట తానే బన్నీవాస్ ను దూరం పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో బన్నీ వాస్ జనసేనకు, పవన్ కు దూరం అయినట్లు టాక్. ఇక రాజకీయాలు అన్నీ వదిలేసి, పూర్తిగా సినిమాల మీదే దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది.
అసలు ఏం జరిగింది అన్నది ఆరా తీస్తే చిత్రమైన కారణాలు వినిపిస్తున్నాయి. తన సినిమాలు వకీల్ సాబ్, భీమ్లా నాయక్ విడుదల టైమ్ లో బన్నీ వాస్ సరైన మద్దతుగా నిలవలేదని పవన్ పీలయినట్లు భోగట్టా.
రాధేశ్యామ్ విషయంలో నిర్మాత వంశీ స్నేహితుడు కనుక బన్నీ వాస్ చాలా వ్యవహారాల్లో మద్దతుగా నిలిచారన్నది కూడా ఓ అభియోగం అంట. మొత్తానికి ఏదో జరిగింది. ఎక్కడో అపోహలు చోటు చేసుకున్నాయి. దీని వల్ల బన్నీ వాస్ లాంటి క్రియాశీలక వ్యక్తిని పవన్ దూరం చేసుకున్నారు.