మాట పడతానని, విమర్శలు వస్తాయని, ట్రొలింగ్ తప్పదని తెలిసినా కూడా పవన్ కళ్యాణ్ ఎందుకు తెలుగుదేశంతో దోస్తానా వైపే మొగ్గు చూపారు. ప్యాకేజీ తొక్క తొటకూర అన్న మాటలు కాదు. లాజికల్ గా థింక్ చేస్తే పవన్ వైపు నుంచి చూస్తే అదే కరెక్ట్.
2019లో మాదిరిగా పవన్ తేదేపా వైపు వెళ్లకుండా భాజపాతో కలిసి పోటీ చేసారు అనుకుందాం. భాజపాతో కలిసి పోటీ అంటే జనసేన ఒంటరిగా పోటీ చేసినట్లే. ఎందుకు అంటే తెలుగుదేశం ఆవిర్భావం నుంచి రాష్ట్రంలో భాజపాను కొందరు పెద్దలు కలిసి అచేతన స్థితిలో వుంచుకుంటూ వచ్చారు. ఒక విధంగా స్లో పాయిజినింగ్ చేసినట్లు చేసేసారు. అందువల్ల జనసేన-భాజపా కలిసినా, జనసేన ఒంటరి పోరు అన్నా ఒక్కటే.
అప్పుడు ఫలితం ఏమవుతుంది. మహా అయితే ఎన్నో కొన్ని సీట్లు వస్తాయి. కానీ జగన్ ప్రభుత్వం రావడానికే ఎక్కువ చాన్స్ వుంటుంది. అప్పుడు ఆ గెలిచిన వాళ్లు జనసేనతో వుంటారన్న గ్యారంటీ లేదు. పవన్ రాజకీయం మళ్లీ మరో అయిదేళ్లు సైలంట్ గా వుండాలి. అంటే అప్పటికి పవన్ ఒకటి రెండు తక్కువగా 60 ఏళ్లకు చేరుకుంటారు. అయిదెేళ్లు పార్టీని మరోసారి కాచుకుంటూ రావడం అంటే అంత సులువు కాదు.
అదే కనుక తెలుగుదేశం తో కలిసి పోటీ చేస్తే…మరి కొన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకోవడానికి అవకాశం వుంటుంది. జగన్ ను నిలవరించవచ్చు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే అధికారం పంచుకోవచ్చు. అధికారం పంచుకోవడం ద్వారా పార్టీని నిలబెట్టుకోవచ్చు. ఇది తప్ప మరో మార్గం లేదు పవన్. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, బాబు గారి దగ్గర చేతులు కట్టుకుని నిల్చున్నారు అన్నా, అమ్ముడుపోయారు అన్నా, అన్నీ భరించి అయినా తెలుగుదేశంతో కలిసి వెళ్లడం ద్వారానే జనసేనను కాస్తయినా నిలబెట్టుకునే అవకాశం వుంది.
లేదూ అంటే రాజకీయాలు చేయడమే కష్టం అవుతుంది. అందుకే పవన్ కు మరో ఆప్షన్ లేదు.