కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్ లో రెండో రోజు కర్నూలు జిల్లా ఆదోనీ ప్రాంతంలో సాగుతోంది. ఇవాళ రాహుల్ గాంధీ ఆదోనీలో మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సమస్యలపై స్పందించారు. ముఖ్యంగా చంద్రబాబు డ్రిమ్ ప్రాజెక్ట్ అయిన అమరావతిపై కాంగ్రెస్ పార్టీ ఆలోచన బయటకి చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ కు ఒక్కటే రాజధాని ఉండాలని అది అమరావతి మాత్రమే ఉండాలన్నారు. మూడు రాజధానుల నిర్ణయం సరైంది కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంతో కొన్ని హామీలు ఇచ్చామని, వాటిని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నెరవేరుస్తామని హామి ఇచ్చారు. ఏపీకి ప్రతేక్య హోదా ఇస్తామన్నారు. పోలవరం కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి చేస్తుందని హామి ఇచ్చారు.
ప్రతేక్య హోదా, పోలవరంపై అధికారంలో ఉన్నప్పుడు కేవలం మాటలతో మభ్యపెట్టి తీరా అధికారం దూరం అయిన తర్వాత మేము వస్తే ఇస్తాము, కడతాం అనడం రాజకీయ పార్టీలకు పరిపాటిగా మారినట్లు ఉంది. విభజన టైంలో చేసిన తప్పిదాల వల్ల కాంగ్రెస్ ఇప్పటికై తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్ లోను ఉనికిని కొల్పోయింది.
అలాగే ఆంధ్రప్రదేశ్ లో పొత్తులపై మాట్లాడుతూ ఎన్నికల్లో పొత్తులపై పార్టీ అధ్యక్షుడిదే తుది నిర్ణయమేనన్నారు. బహుశ వచ్చే ఎన్నికల్లో టీడీపీ- జనసేన- బీజేపీ పొత్తు లేకపోతే టీడీపీ-జనసేన-కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకొవచ్చు. ఎందుకంటే ముగ్గురి అజెండా అమరావతినే దానిలోను జనసేన లాగా కాంగ్రెస్ పార్టీ కూడా చంద్రబాబు నాయుడుకు పాత మిత్రుడే కదా.