Advertisement

Advertisement


Home > Movies - Movie News

పవన్ మళ్లీ మామూలే!

పవన్ మళ్లీ మామూలే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సినిమాలంటే ఇష్టం..కానీ షూటింగ్ చేయడం అంటే కష్టం. మిగిలిన హీరో ల మాదిరిగా చకచకా చేయరు. చేయలేరు. అజ్ఞాత వాసి, భీమ్లా నాయక్ సినిమాలకు పవన్ సన్నిహితుడు అయి వుండి కూడా త్రివిక్రమ్ ఎంత కిందా మీదా పడ్డారో ఆయనకు ఆ యూనిట్ కు తెలుసు. పవన్ తో సినిమా చేయడం అంటే ఎంత ఇబ్బంది అన్నది హరి హర వీర మల్లు దర్శక, నిర్మాతలకు ఇంకా బాగా తెలుసు.

అయితే ఆ మధ్య అంతా సినిమాలు చేయాల్సిన టైమ్ లొ ఖాళీగా వుండి, రాజ‌కీయాలు చేయాల్సిన టైమ్ లో సినిమాలు పెట్టుకున్నారు. అది ఎందుకు, ఏమిటి, లోకేష్ యాత్ర జ‌రుగుతోందనా? ఇలాంటి ప్రశ్నలు అన్నీ మనకు అనవసరం. అవి సినిమా సంగతులు కావు. చకచకా సినిమాలు చేసేయాలని డిసైడ్ అయిపోయి పీపుల్స్ మీడియా-సముద్రఖని సెట్ మీదకు వచ్చారు. నాన్ స్టాప్ గా చాలా వరకు చేసారు. ఇదేదో బాగుంది. ఈ నెలాఖరుకు పవన్ పాత్ర మొత్తం షూట్ అయిపోతుందనుకున్నారు.

కానీ మళ్లీ బ్రేకులు పడడం ప్రారంభమైంది. పార్టీ కార్యక్రమాల కోసం రెండు రోజులు, వచ్చాక బడలిక మీద రెండు రోజులు ఎగిరిపోయాయని తెలుస్తోంది. మళ్లీ షూట్ ప్లాన్ చేసారు. ఈ శనివారం నుంచి మొదలు కావాలి. కానీ మళ్లీ మూడ్ బాలేదని శనివారం షూట్ క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది. శని, ఆది, సోమ ఒకే లోకేషన్ లో ప్లాన్ చేసారు. శనివారం పోయింది. మరి ఆదివారం వుంటుందా అన్నది చూడాలి.

పెద్దగా కష్టపడాల్సిన సినిమా కాకుంటేనే ఇలా వుంది. ఇక పాటలు, ఫైట్లు, ఇంకా చాలా వుండే హరీష్ శంకర్ సినిమా అంటే ఎలా వుంటుందో చూడాల్సిందే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?