టాలీవుడ్ లో చిత్రమైన గ్యాసిప్ చక్కర్లు కొడుతూంది. సినిమా హీరోలు అప్పుడప్పుడు షూటింగ్ లు క్యాన్సిల్ కొట్టడం పెద్ద చిత్రం కాదు. కానీ పవన్ కళ్యాణ్ డుమ్మా కొట్టినంతగా ఏ హీరో కూడా కొట్టరు. వకీల్ సాబ్ టైమ్ లో ఎన్ని సార్లు ఆంధ్రకు వెళ్లి రావడానికి, పొలిటికల్ యాక్టివిటీలకు షూటింగ్ క్యాన్సిల్ చేసారో యూనిట్ కే తెలుసు.
అలాగే అజ్ఞాతవాసి, భీమ్లా నాయక్ సినిమాలకు ఎన్ని రోజులు షూటింగ్ లు క్యాన్సిల్ కొట్టారో ఆ నిర్మాతలకే తెలుసు. ఈయన 'సారీ రాలేను' అనడం, వాళ్లు కాంబినేషన్ యాక్టర్లను అందరినీ బతిమాలుకోవడం మామూలే. అయితే లేటెస్ట్ గా వినిపిస్తున్న గ్యాసిప్ ఏమిటంటే, వైకాపా జనాలు ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి పవన్ మీద విమర్శలు చేస్తే చాలు, ఆయన మూడ్ ఆఫ్ అయిపోతున్నారట.
పేన్ని, కొడాలి, బొత్స, కన్నబాబు, ఇలా చాలా మంది వైకాపా జనాలు పవన్ మీద విరుచుకుపడుతుంటారు. అలా విరుచుకుపడి పోయినపుడల్లా పవన్ మూడ్ ఆఫ్ అయిపోతున్నారని తెలుస్తోంది. పవన్ క్యాన్సిల్ కొట్టిన డేట్ ల్లో ఇలాంటివి వున్నట్లు వినిపిస్తోంది. అయితే పొలిటికల్ కార్యక్రమాల కోసం లేదా అంటే ఇలా మూడ్ ఆఫ్ అయినపుడల్లా షెడ్యూళ్లు క్యాన్సిల్ అవుతున్నాయట.
2019లో ఓటమి అనంతరం మళ్లీ సినిమాల్లోకి రావాలని పవన్ డిసైడ్ అయ్యారు. 2014 నుంచి 2019 మధ్యలో తెలుగుదేశం అధికారంలో వున్నపుడు ఆయన ఖాళీగానే వున్నారు. కానీ సినిమాలు చేయలేదు. 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక సినిమాలు మళ్లీ స్టార్ట్ చేసారు. గడచిన మూడేళ్లలో ఆయన రెండు సినిమాలు మాత్రమే ఫినిష్ చేయగలిగారు. ఇంకా ఒప్పుకున్న సినిమాలు నాలుగైదు వరకు వున్నాయి.
కానీ ఇప్పుడు రాజకీయ వేడి రుగులుకుంది. ఇక ఎవరో ఒకరు పవన్ ను టార్గెట్ చేస్తూనే వుంటారు. అలా చేసినపుడల్లా సినిమా షూట్ క్యాన్సిల్ అంటే అవన్నీ ఎప్పటికి పూర్తి అయ్యేను?