జనసేన అప్పుడే చేదవుతోంది

కాస్త నీరసం తగ్గితే తనంత వాడు లేడన్నాడట వెనకిటికి ఒకడు. తెలుగుదేశం పునాదుల్లో వున్న సామాజిక వర్గం వైఖరి అలాగే వుంటుంది. నిన్న మొన్నటి వరకు వన్ సైడ్ లవ్ అంటూ జనసేన పొత్తు…

కాస్త నీరసం తగ్గితే తనంత వాడు లేడన్నాడట వెనకిటికి ఒకడు. తెలుగుదేశం పునాదుల్లో వున్న సామాజిక వర్గం వైఖరి అలాగే వుంటుంది. నిన్న మొన్నటి వరకు వన్ సైడ్ లవ్ అంటూ జనసేన పొత్తు కోసం తహతహలాడిపోయారు. 

జనసేన ను ఎలాగైనా కలుపుకుని వెళ్లాల్సిందే అనుకున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. కానీ ఇప్పుడు మహానాడుకు కాస్త జనాలు రాగానే జనసేనతో పొత్తు అవసరమా అని ఆలోచనలు మొదలయ్యాయి. 

పొత్తు పెట్టుకుంటే అనవసరం గా పాతిక లేదా ముఫై సీట్లు ఇవ్వాల్సి వుంటుంది అనే బాధ మొదలయినట్లుంది.

నిన్నటికి నిన్న ట్విట్టర్ లో ఒక హార్డ్ కోర్ తెలుగుదేశం ఫ్యాన్, అదే సామాజిక వర్గానికి చెందిన అక్కౌంట్ హోల్డర్ ఇన్ డైరెక్ట్ గా పవన్ ను క్రిటిసైజ్ చేస్తూ పోస్ట్ పెట్టారు. 

పాపులర్ కుటుంబానికి చెందిన ఆ వ్యక్తి పెట్టిన పోస్ట్ కు పవన్ మద్దతు దారుల నుంచి గట్టి అటాక్ వచ్చింది. నిన్న మొన్నటి దాకా పవన్ కోసం దేవులాడింది ఎవరు? వన్ సైడ్ లవ్ అంటూ వెంపర్లాడింది ఎవరు అంటూ కౌంటర్ అటాక్ లు గట్టిగా ఇచ్చారు. 

దాంతో కక్క లేక, మింగలేక, ఏదోదో సమాధానం ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆ సామాజిక వర్గం చుట్టూ కనిపించని వైఫై వుంటుంది. అందరి ఆలోచనాధోరణి ఒకలాగే వుంటుంది. చూస్తుంటే పవన్ ఇక దూరం పెట్టేలాగే వున్నారు.