Advertisement

Advertisement


Home > Movies - Movie News

పవన్ సరసన మాళవిక మోహనన్

పవన్ సరసన మాళవిక మోహనన్

మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ తెలుగులో మరో చాన్స్ కొట్టేసింది. ఇప్పటికే ఓ సినిమా చేస్తోంది. మారుతి-ప్రభాస్ కాంబినేషన్ లో. ఇప్పుడు మళ్లీ అదే రేంజ్ సినిమా చాన్స్ అందుకుంది. 

పవన్ కళ్యాణ్ చేస్తున్న తెరి రీమేక్ లో మాళవిక మోహనన్ ను తీసుకుంటున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం శ్రీలీలను ఓ హీరోయిన్ గా తీసుకున్నారు. మరో హీరోయిన్ గా మాళవిక మోహనన్ ను ఓకె చేసారు.

ఈ ముఫై ఏళ్ల ముద్దుగుమ్మ ఇప్పటికే చాలా మలయాళ, కన్నడ, తమిళ, హిందీ సినిమాల్లో చేసేసింది. వీటిలో విజ‌య్, రజ‌నీ సినిమాలు కూడా వున్నాయి. తెలుగులోకి రావడం ప్రభాస్..పవన్ లతోనే. మాళవిక రెమ్యూనిరేషన్ దగ్గర కాస్త ఫ్లెక్సీ గా వుంటుందని టాక్. 

సినిమాను బట్టి, హీరోను బట్టి పారితోషికం మీద పెద్దగా పట్టు పట్టకుండా వుంటుందని తెలుస్తోంది. కానీ ఎంతయినా కోటి రూపాయలకు పైనే అని తెలుస్తోంది.

పవన్-మైత్రీ సినిమా ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి సెట్ మీదకు వెళ్తుంది. ఓ భారీ సెట్ కు ఆర్ట్ డైరక్టర్ ఆనంద్ సాయి రూపకల్పన చేస్తున్నారు. దాదాపు రెండు వారాలు ఫస్ట్ షెడ్యూలు షూటింగ్ వుంటుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?