‘పవర్ స్టార్’ ను మరిపించేందుకే పవన్ ఇంటర్వ్యూ

నిన్న ఉదయం నుంచి పవర్ స్టార్ ట్రయిలర్ పై చర్చ ఓ రేంజ్ లో జరిగింది. సోషల్ మీడియాలో అంతా దాని గురించే మాట్లాడుకున్నారు. ఎవరికి తోచిన విశ్లేషణలు వాళ్లు చేశారు. కట్ చేస్తే,…

నిన్న ఉదయం నుంచి పవర్ స్టార్ ట్రయిలర్ పై చర్చ ఓ రేంజ్ లో జరిగింది. సోషల్ మీడియాలో అంతా దాని గురించే మాట్లాడుకున్నారు. ఎవరికి తోచిన విశ్లేషణలు వాళ్లు చేశారు. కట్ చేస్తే, సాయంత్రానికి టాపిక్ మొత్తం పవన్ కల్యాణ్ వైపు మళ్లింది. పవన్ నుంచి 4 కొత్త ఫొటోలు వచ్చాయి. ఈరోజు ఇంటర్వ్యూ కూడా వస్తుందని ప్రకటించడంతో అది కాస్తా వైరల్ అయింది.

సరిగ్గా ఇక్కడే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇప్పటికిప్పుడు పవన్ కల్యాణ్ ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? సందర్ఙం, అవకాశం ఉన్నప్పటికీ కెమెరా ముందుకు రావడానికి ఇంట్రెస్ట్ చూపించని పవన్, ఆఘమేఘాల మీద ఇంటర్వ్యూ ఎందుకిచ్చారు? కేవలం “పవర్ స్టార్” సినిమా నుంచి జనాల ఎటెన్షన్ ను తప్పించేందుకే పవన్ ఈ ఎత్తుగడ వేశారని అంటున్నారు చాలామంది.

సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి జిమ్మిక్కులు చాలానే చూస్తుంటాం. మహేష్ బాబు మీద ఏదైనా ఓ ట్రెండ్ స్టార్ట్ అయిందంటే చాలు దానికి అడ్డుకంట వేసేందుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అడ్డంగా మరో ట్రెండ్ స్టార్ట్ చేస్తుంటారు. ఏదైనా పెద్ద హీరో నుంచి ఫస్ట్ లుక్కో లేదా టీజర్ వస్తుందంటే చాలు, ఆ ఫోకస్ ను డైవర్ట్ చేసేందుకు మరో హీరో ఇంకేదో ఫొటోలు రిలీజ్ చేస్తుంటాడు. సరిగ్గా ఇదే ఫార్ములాను పవన్ ఇప్పుడు ఫాలో అయ్యారని అంటున్నారు కొంతమంది.

గడిచిన 24 గంటలుగా పవన్ ఫ్యాన్స్ తో పాటు జనసైనికులంతా అన్ని పనులు మానేసి వర్మను మాత్రమే టార్గెట్ చేయడం పనిగా పెట్టుకున్నారు. వీళ్లను తనవైపు తిప్పుకోవడంతో పాటు జనాల ఎటెక్షన్ ను మరల్చేందుకు పవన్ ఇలా ఇంటర్వ్యూ వదుల్తున్నారనేది చాలామంది వాదన.

పార్టీ మీడియా విభాగం, సోషల్ మీడియా విభాగం మేరకు, జనసైనికుల కోరిక మేరకు పవన్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నారంటూ ఆ పార్టీ ప్రెస్ నోట్ లో కవర్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ.. “పవర్ స్టార్” ట్రయిలర్ రిలీజైన రోజునే పవన్ ఇంటర్వ్యూ ఇవ్వడమనేది కాకతాళీయంగా జరిగింది కాదనే విషయం తెలుస్తూనే ఉంది.

ఆర్జీవీ చాలా తెలివైనోడు