పవన్.. ప్రభాస్.. వేరే లెవెల్

మనం లేకుండానే మన సినిమా షూట్ అయిపోతూ వుంటే ఆ కిక్కే వేరప్పా అని డైలాగు రాసుకోవాలేమో కొత్తగా. ఈ అదృష్టం అందరికీ దక్కదు.  Advertisement ప్రభాస్, పవన్ లకు మాత్రమే. వారు ఎంచుకునే…

మనం లేకుండానే మన సినిమా షూట్ అయిపోతూ వుంటే ఆ కిక్కే వేరప్పా అని డైలాగు రాసుకోవాలేమో కొత్తగా. ఈ అదృష్టం అందరికీ దక్కదు. 

ప్రభాస్, పవన్ లకు మాత్రమే. వారు ఎంచుకునే సినిమాలు అలాంటివేమో? పవన్ ప్రమేయం లేకుండా ఓజి సినిమా షూట్ అవుతూనే వుంది. ఇప్పటికే 50శాతం పూర్తయిపోయింది. ఎలా..హౌ..అది అంతే. ఇక మారుతి-ప్రభాస్ సినిమా కూడా అంతే. గుట్టుచప్పుడు కాకుండా షూటింగ్ జరుగుతూనే వుంది వీలయినపుడల్లా. ప్రభాస్ లేకుండా కూడా షూటింగ్ జరుగుతూనే వుంది. మళ్లీ ఎలా..హౌ..అంటే అది అంతే.

పవన్ నేరుగా షూట్ చేయాల్సిన, కాస్ట కష్టపడాల్సిన హరి హర వీరమల్లు, ఉస్తాద్ సినిమాల షూట్ లు అలాగే వున్నాయి. ఉస్తాద్ సినిమా నాలుగే నాలుగు రోజులు షూటింగ్ జరిగింది. ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అని దర్శకుడు హరీష్ ఓ ట్వీట్ వేసారు కానీ, అప్పటి నుంచి ఆగిపోయే వుంది. పైగా ఈ సినిమాను స్క్రాప్ చేసారంటూ ట్వీట్టర్లో ఫేక్ ప్రచారం స్టార్ట్ అయిపోయింది. సరే, అదంతా వేరే.

పవన్ ఎంచుకున్న ఓజి, బ్రో సినిమా కథలు వేరే టైపు. ఆయన ముఫై నుంచి నలభై రోజుల వర్క్ చేస్తే చాలు. ప్రభాస్ ఎంచుకున్న ఆదిపురుష్ ఎలాంటిదో, దానికి ప్రభాస్ ఎన్ని రోజులు వర్క్ చేసి వుంటారో సినిమా చూసిన వారికి అర్థం అయ్యే వుంటుంది. ఇప్పుడు మారుతి సినిమా మాత్రం అలాంటిది కాదు. కానీ అది కూడా సైలంట్ గా అసలు ఎప్పుడు షూట్ జరుగుతోందో, లేదో కూడా తెలియకుండా జరిగిపోతోంది. ఎలా? అంటే అలాగే అనుకోవాలి.