పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ఓజీ. ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించారు. సెప్టెంబర్ 27న థియేటర్లలోకి రాబోతోంది. ఇక తాజాగా దేవర పార్ట్-1 రిలీజ్ డేట్ కూడా వెల్లడించారు. అక్టోబర్ 10న ఈ సినిమా రిలీజ్ అవుతోంది.
అంటే పవన్ సినిమాకు ఉన్నది కేవలం 2 వారాల టైమ్ మాత్రమే. మరి ఈ 2 వారాలు ఓజీకి సరిపోతాయా? దేవర రిలీజైన తర్వాత ఓజీ ఆటోమేటిగ్గా భారీ సంఖ్యలో థియేటర్లను కోల్పోతుంది.
రీసెంట్ గా సలార్ విషయంలో ఇలానే జరిగింది. డిసెంబర్ 22న ఆ సినిమా విడుదలైంది. థియేటర్లలో 3 వారాల టైమ్ కూడా ప్రభాస్ కు దొరకలేదు. ఆ వెంటనే సంక్రాంతి సినిమాల సందడి మొదలైపోయింది.
సలార్ సినిమా హిట్టయినప్పటికీ, జనవరి 10 నుంచి భారీగా థియేటర్లు కోల్పోవాల్సి వచ్చింది. అదే పోటీ లేకుండా వచ్చినట్టయితే, ఈ సినిమా మరిన్ని రికార్డులు తిరగరాసి ఉండేది.
ఇప్పుడు ఓజీ సినిమాకు కూడా ఆ అవకాశం లేకుండా పోయింది. సినిమా ఎంత పెద్ద హిట్టయినా 2 వారాల తర్వాత తప్పనిసరి పరిస్థితుల మధ్య థియేటర్లు తగ్గించాల్సి వస్తుంది. దీని వల్ల రికార్డులకు అవకాశం ఉండదు.
అసలే భారీ బడ్జెట్ సినిమా. ఇలాంటి సినిమాకు థియేటర్లలో కేవలం 2 వారాలు మాత్రమే టైమ్ దొరుకుతోంది. ఆ తర్వాత దేవరతో థియేటర్లు షేర్ చేసుకోవాల్సి వస్తుంది.