అభ్యర్థిని ఆసాంతం నాకేస్తున్నారు

మన సినిమా జనాలు భలేగా వుంటారు. ముఖ్యంగా హీరోలు, వారి బంధువులు. ఎక్కడికి వెళ్లినా ఫ్రీ గా ఎలా పని చేయించుకోవాలా అని చూస్తారు. సినిమాను బతికించండి, థియేటర్ కు వెళ్లి సినిమా చూడండి…

మన సినిమా జనాలు భలేగా వుంటారు. ముఖ్యంగా హీరోలు, వారి బంధువులు. ఎక్కడికి వెళ్లినా ఫ్రీ గా ఎలా పని చేయించుకోవాలా అని చూస్తారు. సినిమాను బతికించండి, థియేటర్ కు వెళ్లి సినిమా చూడండి అని స్టేజ్ ఎక్కి చెబుతారు. వాళ్లు మాత్రం క్యూబ్ పర్మిషన్ అడిగి ఇళ్లలోనే చూస్తారు.

పోనీ క్యూబ్ ఫీజ్ కడతారా? నిర్మాతకు కొంతయినా వచ్చేలా చూస్తారా అంటే అదీ కాదు. మొహమాటం వాడి, నిర్మాత దగ్గర ఫ్రీగా పర్మిషన్ తీసుకుంటారు. ఇదీ టాలీవుడ్ ట్రెండ్. ఇది అందరికీ తెలిసిందే.

మరి అలాంటి సినిమా వాళ్లు ఎన్నికల్లోకి దిగితే ఎదురు డబ్బులు తీసుకుంటారు తప్ప జేబులోంచి డబ్బులు తీయరు. ఓ సినిమా మనిషి ఉత్తరాంధ్రలో పోటీకి దిగాలనుకుంటున్నారు.

అంతకు ముందే ఓ సౌండ్ పార్టీ పరిచయం అయింది. ఆ పార్టీ కూడా ఎన్నికల్లో పోటీకి దిగాలనుకుంటున్నారు. దాంతో ఇంకేముంది.. ఫ్రెండ్ షిప్ కుదిరిపోయింది. ఉత్తరాంధ్రలో ఈ సినిమా మనిషి ఉండడానికి ఇల్లు ఆ సౌండ్ పార్టీనే సెట్ చేసినట్లు బోగట్టా. అలాగే ఓ వెహికిల్ కూడా అందుబాటులో వుంచారు. ఇక ఫుడ్ సంగతేముంది లెండి. ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు చూస్తారు.

మొత్తం ఆ సౌండ్ పార్టీకి టికెట్ ఫిక్స్ నా కాదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. కానీ ఈ లోగా ఈ సినిమా పరాన్నజీవి మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతున్నారు.