బాలకృష్ణ సినిమాలో విశ్వక్ సేన్.. జస్ట్ మిస్?

సినిమాలు మిస్ చేసుకోవడం విశ్వక్ సేన్ కు కొత్త కాదు. బేబి లాంటి హిట్ సినిమాను అతడు మిస్సయ్యాడు. ఆ తర్వాత సీనియర్ హీరో అర్జున్ దర్శకత్వంలో చేయాల్సిన సినిమా నుంచి కూడా డ్రాప్…

సినిమాలు మిస్ చేసుకోవడం విశ్వక్ సేన్ కు కొత్త కాదు. బేబి లాంటి హిట్ సినిమాను అతడు మిస్సయ్యాడు. ఆ తర్వాత సీనియర్ హీరో అర్జున్ దర్శకత్వంలో చేయాల్సిన సినిమా నుంచి కూడా డ్రాప్ అయ్యాడు. ఇప్పుడు మరో పెద్ద అవకాశాన్ని వదులుకున్నాడు ఈ హీరో.

“రీసెంట్ గా ఓ పెద్ద సినిమాలో పెద్ద రోల్ కూడా వదిలేశా. అందులో నాకిష్టమైన ఓ పెద్ద హీరో నటిస్తున్నాడు. అందులో కీలకమైన పెద్ద రోల్ నాకు ఆఫర్ చేశారు. ఇంకా చెప్పాలంటే వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ చేసినలాంటి రోల్ అనుకోవచ్చు. నాకిష్టమైన హీరో సినిమాలో అంత పెద్ద మంచి రోల్ వస్తే నేను వదిలేశా. నేను చేయలేదు.”

ఇలా రీసెంట్ గా కూడా ఓ సినిమా ఆఫర్ వదిలేసిన విషయాన్ని బయటపెట్టాడు విశ్వక్ సేన్. ఈ హీరో నేరుగా చెప్పకపోయినా, అది బాలకృష్ణ సినిమా ఆఫర్ అయి ఉంటుందని చాలామంది భావిస్తున్నారు.

బాబి దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న సినిమాలో ఓ కీలకమైన పాత్ర ఉంది. ఆ క్యారెక్టర్ కోసం విశ్వక్ సేన్ ను అనుకున్నారు. ఆ మేటర్ ఆమధ్య లీక్ అయింది కూడా. కానీ విశ్వక్ ఆ సినిమా నుంచి డ్రాప్ అయ్యాడనే విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

ఆ సినిమా చేసుంటే తనకు బాగా డబ్బులు వచ్చి ఉండేవని, కానీ తనకు డబ్బు కంటే కథ, క్యారెక్టర్ ముఖ్యమని ప్రకటించాడు. అదే పెద్జ హీరోతో ఇంకా మంచి సినిమా చేస్తానని ప్రకటించాడు. వంద మందిలో ఐదుగురు తన క్యారెక్టర్ ను ఇష్టపడితే, తను వాళ్ల కోసం మాత్రమే సినిమాలు తీస్తానని, మిగతా 95 మందిని తృప్తిపరిచడం కోసం ప్రయత్నించనని క్లియర్ గా చెబుతున్నాడు విశ్వక్.