పాయల్ ఇక ఐటెంసాంగ్స్ చేసుకోవడమేనా!

ఒకటి కాదు, ఏకంగా 2 సినిమాల్లో ఆమె ఐటెంసాంగ్స్ చేయబోతోందంటూ మినిమం గ్యాప్స్ లో వార్తలు వచ్చాయి. బన్నీ-సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప సినిమాలో పాయల్ రాజ్ పుత్ తో ఓ స్పెషల్ సాంగ్…

ఒకటి కాదు, ఏకంగా 2 సినిమాల్లో ఆమె ఐటెంసాంగ్స్ చేయబోతోందంటూ మినిమం గ్యాప్స్ లో వార్తలు వచ్చాయి. బన్నీ-సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప సినిమాలో పాయల్ రాజ్ పుత్ తో ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారనేది ఒక వార్త అయితే.. కమల్ నటిస్తున్న ఇండియన్-2లో కూడా పాయల్ ఐటెంసాంగ్ చేయబోతోందనేది మరో న్యూస్.

ఈ రెండు పుకార్లతో పాయల్ కెరీర్ పై చాలా విశ్లేషణలు పుట్టుకొచ్చాయి. ఇక ఆమె టాలీవుడ్ కు సరికొత్త ఐటెం క్వీన్ గా మారుతుందని, మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ రోల్స్ కంటే ఇలాంటి ఐటెంసాంగ్స్ లోనే ఆమె ఎక్కువగా కనిపిస్తుందని అన్నారు. కట్ చేస్తే.. ఈ పుకార్లన్నింటినీ గంపగుత్తగా ఖండించింది పాయల్.

“ఈ పుకార్లు ఎలా వస్తున్నాయో అర్థం కావడం లేదు. నేను ఎలాంటి స్పెషల్ సాంగ్స్ చేయడం లేదు. పుష్ప, ఇండియన్-2లో స్పెషల్ సాంగ్స్ చేస్తున్నావా అంటూ చాలామంది అడుగుతున్నారు. అలాంటిదేం లేదు. ఇప్పటివరకు నేను ఏ సినిమాకు సైన్ చేయలేదు. ఏ షూటింగ్ లో పాల్గొనడం లేదు.”

మరోవైపు సినిమాలకు సంబంధించి తన ఆలోచనల్ని బయటపెట్టింది పాయల్. ప్రస్తుతం తన వద్ద చాలా స్క్రిప్టులు ఉన్నాయని, వాటిని చదువుతున్నట్టు చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఐటెంసాంగ్స్ కంటే మంచి కంటెంట్ ఉన్న పాత్రలు చేయాలనుకుంటున్నట్టు స్పష్టంచేసింది.

ఇడ్లీపాత్ర లాగా ఉప్మాగిన్ని లాగా డిజైన్లు చేశారు