ఈరోజు 'నాట్యం' అనే సినిమా లుక్ విడుదలయింది. సాధారణంగా సినిమాలకు సంబంధించి రోజూ ఏదో ఒకటి విడుదలవుతూనే వుంటాయి. కానీ కొన్నింటి మీద ముందే హడావుడి వుంటుంది. కానీ కొన్ని విడుదలయిన తరువాత విషయం తెలిసాక, ఔనా అనుకోవాల్సి వుంటుంది.
ఈ నాట్యం అనే సినిమా వ్యవహారం అలాంటిదే. ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ ను మెగా కోడలు ఉపాసన విడుదల చేసారు. ఆమెకు ఏమిటి కనెక్షన్ అని ఆరా తీస్తే ఆ సినిమా చేసింది మరో పెద్దంటి కోడలు అని.
ఆమె ఎవరో కాదు. సంధ్య రాజు. అలా అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. సత్యం రామలింగరాజు కోడలు అంటే టక్కున తెలుస్తోంది. రామలింగరాజు కుమారుడు రామరాజు భార్య ఆమె. అంతే కాదు, ఓ భారీ సిమెంట్ సంస్థ భాగస్వాముల ఇంటి బిడ్డ.
నాట్యం మీద మక్కువతో నేర్చుకుని, ప్రదర్శనలు ఇచ్చిన సంధ్య రాజు ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాల్లో చాలా యాక్టివ్ గా వుంటారు. అంతేకాదు ఇప్పటికే మలయాళంలో ఓ సినిమాలో నటించారు కూడా.
ఇక్కడ సమంత నటించిన యుటర్న్ సినిమా ఆధారంగా మలయాళంలో నిర్మించిన కేర్ ఫుల్ మూవీలో సంధ్యరాజు నటించారు. నాట్యం ఆమె రెండో సినిమా.