శ్రీకాంత్, సునీల్ ప్రధాన పాత్రల్లో కార్తికేయ, అభిరామ్, ప్రవీణ్, హరీష్ గౌతమ్‌లను హీరోలుగా పరిచయం చేస్తూ వి.సముద్ర డైరక్షన్ లో నిర్మించిన సినిమా జైసేన. వి.సాయి అరుణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలు విడుదలయ్యాయి.
ఈ చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా యూనిట్ మీడియా మీట్ ను ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. ఈ కార్యక్రమంలో నటుడు సునీల్, దర్శకుడు సముద్ర, నటులు కార్తికేయ, అభిరామ్, ప్రవీణ్, హరీష్ గౌతమ్ పాల్గొన్నారు…
నటుడు సునీల్ మాట్లాడుతూ – “ఒక రైతుకు మన అవసరం లేకున్నా.. మనందరికీ రైతు అవసరం తప్పకుండా ఉంటుంది. ఇలాంటి మంచి సినిమాల్లో నటించే అవకాశం చాలా రేర్‌గా వస్తుంది. రైతుల సమస్యలని పదిమందికి చెబుతూ ఒక మంచి పరిష్కారాన్ని చూపించడం చాలా గొప్ప విషయం“ అన్నారు.
చిత్ర దర్శకుడు సముద్ర మాట్లాడుతూ – “ జైసేన అనగానే అందరికీ జనసేన అన్నట్టుగా వినపడుతుంది. అది నిజమే ఎందుకంటే జైసేన సినిమా పవన్‌కళ్యాణ్ భావాలకు దగ్గరిగా ఉండే సినిమా. అలాగే రైతుల సమస్యలు సినిమాలో ఈ చర్చించడం జరిగింది. రైతులకు న్యాయం జరిగే విధంగా ఒక మంచి పరిష్కారాన్ని కూడా ఈ మూవీలో చూపించాం.
అందుకే ఈ సినిమాని రైతులకి అంకితం చేస్తున్నాం. రైతులకి సపోర్ట్ అందించడం మనందరి భాధ్యత అని చెప్పే సినిమా. రైతుల కోసం తీసిన కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ సినిమాకి ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
హీరో ప్రవీణ్ , హీరో అభిరామ్ మాట్లాడుతూ – “జనవరి 29న మీముందుకు వస్తున్నాం. మా తొలి ప్రయత్నాన్ని మీరందరూ ఆదరించాలని కోరుకుంటున్నాము“ అన్నారు.
కో ప్రొడ్యూసర్స్ శిరీష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ – “మా టీమ్ అందరూ ఎంతో కష్టపడి తీసిన జైసేన సినిమా జనవరి 29 విడుదలవుతున్నందుకు హ్యాపీగా ఉంది. రైతుల మీద మంచి సబ్జెక్ట్‌తో తీసిన ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం“ అన్నారు.