‘పెద్దాయిన’ కౌగిలింతకు అర్థాలు వేరులే

సినిమా చూసిన తరువాత ఓ మాదిరిగా చెప్పడం వేరు. సాధారణంగా అది లోపల ఒకటి, పైకి ఒకటి అన్నట్లు వుంటుంది. దరిద్రంగా వున్న సినిమాకు కూడా ఓకె  ప‌ర్వ‌లేదు.. బానే వుంది. ఆడేస్తుంది అనేంత…

సినిమా చూసిన తరువాత ఓ మాదిరిగా చెప్పడం వేరు. సాధారణంగా అది లోపల ఒకటి, పైకి ఒకటి అన్నట్లు వుంటుంది. దరిద్రంగా వున్న సినిమాకు కూడా ఓకె  ప‌ర్వ‌లేదు.. బానే వుంది. ఆడేస్తుంది అనేంత వరకు చెబుతారు. అదే తమ స్వంత సినిమా అయితే మరి కాస్త ముందుకు వెళ్లి రికార్డులు బద్దలు కొడుతుంది అంటారు. పైగా ఇలాంటివి అన్నీ కాస్త ఎక్కువగా మీడియా ముందు చెబుతారు. అంతే తప్ప మరీ ఎక్కువగా కాదు.

మొన్నటికి మొన్న గుంటూరు కారం సినిమాను టాలీవుడ్ కు చెందిన ఓ ‘పెద్దాయిన’ చూసారు. చూసిన తరువాత పరుగు పరుగున హీరో ఎక్కడ వున్నారో వాకబు చేసి, అటు పరుగెత్తారు. హీరో ఓ యాడ్ షూట్ లో వున్నారు. వెళ్లి అమాంతం కౌగిలించేసుకున్నారు. అల వైకుంఠపురములో, అత్తారింటికి దారేది కి మించిన హిట్ ఇది అని కితాబు ఇచ్చారు. అక్కడితో ఆగలేదు. అసలు మీ కెరీర్ లో అరివీర భయంకరమైన హిట్ అని కూడా చెప్పేసారు.

ఇది అక్కడ యాడ్ షూట్ లో ఆ టైమ్ వున్న వారి అందరి ముందు జరగడంతో విషయం బయటకు వచ్చింది. పైగా అంతకు ముందే నిర్మాత కూడా ఆర్ఆర్ఆర్ రికార్డులకు దగ్గరగా కలెక్షన్లు వుంటాయి అని అన్నారు. ఇదీ అదీ కలిపి చూసుకుని, సినిమా బ్లాక్ బస్టర్, సూపర్ డూపర్ హిట్ అని సోషల్ మీడియా ఛలో ఛలో అంది.

తీరా చేసి సినిమా విడుదలయ్యాక, అందరి మదిలో ఒకటే ప్రశ్న. ఆ పెద్దాయిన ఎందుకంత హడావుడి చేసారు. ఆ కౌగిలింతకు అర్థం.. పరమార్ధం ఏమిటి అని?