cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

పెళ్లివార్తను కన్ఫర్మ్ చేసిన మెగాస్టార్

పెళ్లివార్తను కన్ఫర్మ్ చేసిన మెగాస్టార్

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పెళ్లి కుదరింది అంటూ ఈనెల 5న వెల్లడించింది గ్రేట్ ఆంధ్ర. అయితే అలాంటిదేం లేదని హీరో సన్నిహిత వర్గాలు అప్పట్లో జోక్ లు కట్ చేసాయి. కానీ ఈరోజు మెగాస్టార్ చిరంజీవి నే ఆ విషయం ధృవీకరించారు. ఇక ఈ బ్యాచులర్ రోజులు లెక్క పెట్టుకోవడమే అనే అర్థం వచ్చేలా ట్వీట్ వేసారు.

దీంతో మెగా హీరో పెళ్లి పీటలు ఎక్కడే రోజు దగ్గరలోనే వుందని చకచకా వార్తలు మరింతగా వచ్చేసాయి. ఈ రోజు  సాయితేజ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా `సోలో బ్రతుకే సో బెటరు` సినిమాలోని `అమృత` పాటను మెగాస్టార్ విడుదల చేశారు. 

ఈ సందర్భంగా `హ్యాపీ బర్త్‌డే ప్రియమైన సాయితేజ్. `సోలో`గా ఉన్నప్పుడే ఫుల్‌గా ఎంజాయ్ చేయ్. నీ బ్యాచిలర్ లైఫ్ ఇంకొన్ని రోజులేన`ని చిరంజీవి పేర్కొన్నారు.