ఐపీఎస్‌తో హీరోయిన్ గొడవ.. కేసు న‌మోదు!

టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హ‌య‌తిపై జూబ్లీహిల్స్ పోలీసు స్టేష‌న్ లో కేసు న‌మోదైంది. ఐపీఎస్ అధికారికి చెందిన కారును ఉద్దేశ‌పూర్వ‌కంగా ఢీకొట్ట‌డంతో పాటు పార్కింగ్ స్థ‌లంలో అడ్డంకులు క‌లిగిసున్న‌ర‌ని డింపుల్ తో పాటు ఆమె…

టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హ‌య‌తిపై జూబ్లీహిల్స్ పోలీసు స్టేష‌న్ లో కేసు న‌మోదైంది. ఐపీఎస్ అధికారికి చెందిన కారును ఉద్దేశ‌పూర్వ‌కంగా ఢీకొట్ట‌డంతో పాటు పార్కింగ్ స్థ‌లంలో అడ్డంకులు క‌లిగిసున్న‌ర‌ని డింపుల్ తో పాటు ఆమె స్నేహితుడిపై కూడా పోలీసులు క్రిమిన‌ల్ కేసు న‌మోదు చేశారు.

జూబ్లీహిల్స్ జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ హుడా ఎన్‌క్లేవ్‌లో ఉన్న ఎస్‌కేఆర్‌ ఎన్‌క్లేవ్‌ అపార్ట్‌మెంట్స్‌లో డింపుల్, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే నివాసముంటున్నారు. ఐపీఎస్ అధికారి వాహ‌నాన్ని డింపుల్ స్నేహితుడు పార్కింగ్ ప్లేస్ లో ఢీ కొట్టారు. అదేంట‌ని అధికారి డ్రైవ‌ర్ ప్ర‌శ్నించ‌గా వాగ్వాదానికి దిగారు. గ‌తంలో కూడా పార్కింగ్ విష‌యంలో ప‌లుమార్లు వాగ్వాదానికి దిగిన‌ట్లు తెలుస్తోంది.

ఐపీఎస్ అధికారి అధికారిక వాహ‌నం కావ‌డంతో డింపుల్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు 353, 341, 279 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. కాగా డింపుల్ ఇటీవ‌లే ఖిలాడి, రామ బాణం చిత్రాల్లో న‌టించింది.