హీరోయిన్లు ప్రేమలో పడడం సహజం. తెరపైనే కాదు, తెరవెనక కూడా చాలా ప్రేమకథలున్నాయి. అయితే సినిమాల్లో చూపించినట్టు అవి హఠాత్తుగా జరిగే పరిణామాలు కావు. వీలు చూసుకొని, తీరిగ్గా ఉన్నప్పుడు ప్రేమలో పడే బాపతు మన హీరోయిన్లు. పూజాహెగ్డే కూడా అదే చెబుతోంది. ప్రేమించాలని తనకు ఉన్నప్పటికీ, ప్రస్తుతం తీరక లేదంటోంది.
“ఎప్పుడూ 4-5 సినిమాలతో బిజీగా ఉంటున్నాను. అస్సలు టైమ్ ఉండడం లేదు. ప్రేమించడానికి చాలా టైమ్ కావాలి. ప్రేమించడానికి నా దగ్గర అంత టైమ్ లేదు. కానీ ప్రేమించాలని మాత్రం ఉంది. అది ఎప్పుడు జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు.”
ఇలా లవ్ పై తన ఒపీనియన్ బయటపెట్టింది పూజా హెగ్డే. ప్రస్తుతం తను సినిమాలతో మాత్రమే ప్రేమలో ఉన్నానంటూ ఓ రొటీన్ డైలాగ్ చెప్పిన పూజా హెగ్డే.. ప్రస్తుతం రాధేశ్యామ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. జాతకాల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రేరణ అనే పాత్ర పోషించింది. ఈ సందర్భంగా జాతకాలపై తనకున్న అభిప్రాయాన్ని బయటపెట్టింది.
“నేను జాతకాల్ని నమ్ముతాను. ఓసారి చూపించుకున్నాను కూడా. అందులో కొన్ని జరిగాయి. కొన్ని జరగలేదు. కానీ నేను మాత్రం నమ్ముతూనే ఉంటాను.”
ఇక ప్రభాస్ తో తనకు అభిప్రాయబేధాలున్నాయనే అంశాన్ని కొట్టి పారేసింది పూజాహెగ్డే. ప్రభాస్ చాలా స్వీట్ పర్సన్ అని, తనతో పాటు తన కుటుంబం మొత్తానికి ఇంటి నుంచి భోజనం పంపించేవాడని చెప్పుకొచ్చింది.