ఆ ఫొటోలు త్వరలోనే బయటపెడతా- పూజాహెగ్డే

అల వైకుంఠపురములో సినిమాకు సంబంధించి అభిమానులకు ఓ గుడ్ న్యూస్ అందించింది హీరోయిన్ పూజా హెగ్డే. బన్నీతో షూటింగ్ టైమ్ లో చాలా ఫొటోలు తీసుకున్నానని, ఆ  ఎక్స్ క్లూజివ్ స్టిల్స్ అన్నింటినీ త్వరలోనే…

అల వైకుంఠపురములో సినిమాకు సంబంధించి అభిమానులకు ఓ గుడ్ న్యూస్ అందించింది హీరోయిన్ పూజా హెగ్డే. బన్నీతో షూటింగ్ టైమ్ లో చాలా ఫొటోలు తీసుకున్నానని, ఆ  ఎక్స్ క్లూజివ్ స్టిల్స్ అన్నింటినీ త్వరలోనే బయటపెడతానంటోంది.

“బన్నీ ఫ్యాన్స్ చాలా ఈగర్ గా ఉన్నారు. అల్లు అర్జున్ నుంచి చాలా గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో వాళ్లు చాలా తెలుసుకోవాలనుకుంటున్నారు. షూటింగ్ లో ఏం జరుగుతుందో చెప్పమని అడిగేవారు. నేను చాలా ఫొటోలు, వీడియోలు తీశాను. కానీ దురదృష్టవశాత్తూ వాటిని బయటపెట్టలేకపోయాను. త్వరలోనే ఆ ఫొటోల్ని రిలీజ్ చేస్తా. సామజవరగమన సాంగ్ కు సంబంధించిన ఫొటోలు మాత్రం పోస్ట్ చేశారు. ఎందుకంటే ఐఫిల్ టవర్ ముందు తీసుకున్న ఫొటోలు కావడంతో ఆగలేకపోయాను. అంతే తప్ప, అవి ప్లానింగ్ చేసి రిలీజ్ చేసిన పిక్స్ కావు.”

ఇక సినిమాలో పాటలపై స్పందిస్తూ.. మూవీలో సూపర్ హిట్టయిన 3 పాటలు తనవే కావడం చాలా హ్యాపీగా ఉందంటోంది పూజా. సాజమవరగమన, రాములో రాములు, బుట్టబొమ్మ సాంగ్స్ అన్నీ హీరోయిన్ ను ఉద్దేశించి పాడినవేనని, ఆ హీరోయిన్ తనే కావడం చాలా హ్యాపీ అంటోంది.

“సినిమాలో సామజవరగమన సాంగ్ పెద్ద హిట్ అయింది. రాములో రాముల, బుట్టబొమ్మ సాంగ్స్ కూడా చాలా పెద్ద హిట్ అయ్యాయి. నాకు ఆనందం ఇచ్చిన విషయం ఏంటంటే.. ఆ మూడు పాటలు అమ్మాయి సెంట్రిక్ గా కంపోజ్ అయిన పాటలు. ఇక సినిమాలో ఆ 3 పాటలు నా చుట్టూనే తిరుగుతాయి. అలా 3 సూపర్ హిట్ సాంగ్స్ నాపై రావడం చాలా హ్యాపీగా ఉంది.”

త్రివిక్రమ్ తో రెండోసారి వర్క్ చేసిన పూజాహెగ్డే.. అరవింద సమేతతో పోలిస్తే, అల వైకుంఠపురములో సినిమాలో తనను దర్శకుడు పూర్తి విభిన్నంగా చూపించాడని, ఫస్ట్ టైమ్ కామెడీ కూడా ట్రై చేశానని అంటోంది