పూజ-ప్రభాస్ ల మధ్య ఏం జరిగింది?

ఇండస్ట్రీ ఇన్ సైడ్ సర్కిళ్లలో వినిపిస్తున్న ప్రశ్న ఇది. సినిమా షూటింగ్ ల్లో చిన్న చిన్న సమస్యలు రావడం మామూలే. హీరో హీరోయిన్ల మధ్య చిన్న చిన్న గొడవలు జరగడం కూడా మామూలే. అయినా…

ఇండస్ట్రీ ఇన్ సైడ్ సర్కిళ్లలో వినిపిస్తున్న ప్రశ్న ఇది. సినిమా షూటింగ్ ల్లో చిన్న చిన్న సమస్యలు రావడం మామూలే. హీరో హీరోయిన్ల మధ్య చిన్న చిన్న గొడవలు జరగడం కూడా మామూలే. అయినా కూడా ఏదో విధంగా బండి లాగించేస్తారు. అంతే తప్ప అస్సలు మొహా మొహాలు చూసుకోకుండా, అసలు కాంబినేషన్ సీన్లు చేయకుండా వుండేంత వ్యవహారం వుండదు.

కానీ రాధేశ్వామ్ సినిమా షూట్ చివరి రెండు నెలలు హీరో హీరోయిన్లు ప్రభాస్-పూజా హెగ్డే అస్సలు మాట్లాడుకోలేదని, అస్సలు ఒకరికి ఒకరు ఎదురు పడలేదని తెలుస్తోంది. ఇద్దరి కాంబినేషన్ సీన్లు కూడా వేరువేరుగా గ్రీన్ మ్యాట్ మీద చిత్రీకరించి, మళ్లీ ఫిక్స్ చేసుకున్నారని తెలుస్తోంది. 

ఈ మేరకు గతంలోనే వార్తలు వచ్చినా, యువి సంస్థ వాటిని ఖండించింది. అయితే విషయం ఎన్నాళ్లో దాగదు కదా? ఇదంతా నిజమే అని, పూజా హెగ్డే కూడా తన సన్నిహితుల దగ్గర కన్ ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే రీజన్ మాత్రం బయటకు రావడం లేదు. 

అస్సలు మొహా మొహాలు చూసుకోకుండా, సినిమా క్వాలిటీ ఎలా వస్తుందో అన్నది ఆలోచించకుండా, కాంబినేషన్ సీన్లు కూడా గ్రీన్ మ్యాట్ లో చేయడం అంటే చాలా బలమైన రీజన్ వుండి వుండాలి? అదేమిటో ఆ ఇద్దరికీ మహా అయితే యువి అధినేతలకు మాత్రమే తెలిసి వుండాలి. 

అయితే విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం ఓ రోజు అంతా చెప్పాపెట్టకుండా పూజా షూటింగ్ ఎగ్గొట్టేసినట్లు, ప్రభాస్ సెట్ లో అలా వెయిటింగ్ లో వుండి పోయినట్లు తెలుస్తోంది. మరి ఒకటి రెండు సార్లు కొన్ని గంటల పాటు కేరవాన్ నుంచి దిగకుండా వుండిపోయినట్లు తెలుస్తోంది. ఆమె వైఖరికి విసిగి ప్రభాస్ దూరం జరిగినట్లు వినిపిస్తోంది.