మోడీకి వ్యతిరేకంగా పవన్…. ?

జనసేనాని పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన ఎట్టకేలకు ఖరారు అయింది. ఆయన ఈ నెల 31న విశాఖ వస్తున్నారు. అంతే కాదు, గత 250 రోజులుగా సాగుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు…

జనసేనాని పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన ఎట్టకేలకు ఖరారు అయింది. ఆయన ఈ నెల 31న విశాఖ వస్తున్నారు. అంతే కాదు, గత 250 రోజులుగా సాగుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు ఇస్తారు. అలాగే, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తన గళాన్ని విప్పుతారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

ఈ సందర్భంగా అక్కడే  పవన్ బహిరంగ సభ కూడా ఉంటుంది అంటున్నారు. మొత్తానికి చూస్తే పవన్ విశాఖ టూర్ లో మరో మారు గర్జిస్తారు, ఆవేశంగా మాట్లాడుతారు అన్నది మాత్రం వాస్తవం. అయితే పవన్ స్టీల్ ప్లాంట్ వద్ద మాట్లాడేది, విమర్శించేది ఎవరిని అన్న చర్చ అయితే వస్తోంది.

ఎందుకంటే ఇప్పటికే సీపీఐ కార్యదర్శి రామక్రిష్ణ అయితే పవన్ విశాఖ వచ్చి ఆందోళన చేపట్టడం కంటే ఢిల్లీ వెళ్లి తమ మిత్ర పక్షం బీజేపీని ఒప్పించి ప్రైవేటీకరణను ఆపాలని కూడా సలహా ఇచ్చారు. మరి పవన్ విశాఖ వస్తున్నారు. ఆయన విమర్శలు చేస్తే మోడీ సర్కార్ మీదనే చేయాలి. పైగా స్టీల్ ప్లాంట్ కేంద్రం ఆధీనంలో ఉన్న సంస్థ. ప్రైవేటీకరణ నిర్ణయాలు కూడా వారే తీసుకుంటున్నారు.

కానీ పవన్ మోడీని విమర్శించగలరా అన్నదే చర్చ. ఆయన మొక్కుబడిగా ప్రైవేటీకరణను కేంద్రం విమరించుకోవాలని అంటూ మాట్లాడి టోటల్ గా ఏపీ సర్కార్ మీద విమర్శలు చేస్తే మాత్రం ఆయన మద్దతు వెనక డొల్లతనమే బయటపడుతుందని కూడా అంటున్నారు. 

విశాఖ స్టీల్ ప్లాంట్ తో ఏపీ సీఎం జగన్ కి ఏ మాత్రం సంబంధం లేదని సీపీఐ రామక్రిష్ణ వంటి వారు ఇప్పటికే చెప్పేశారు. పైగా అది అందరికీ తెలిసిందే. కానీ పవన్ వైసీపీని జగన్ని విమర్శించకుండా విశాఖ సభను ముగిస్తారా అన్నదే అందరికీ డౌట్. 

చూడాలి మరి పవన్ ఏం మాట్లాడుతారో. ఆయన కనుక బీజేపీని తెగనాడినా, మోడీని విమర్శించినా నిజంగా ఏపీ రాజకీయాల్లో అది పెద్ద సంచలనమే అవుతుంది మరి.