తెలుగులో టాప్ హీరోయిన్ల జాబితాలో వుంది పూజా హెగ్డే. అసలు తెలుగు హీరోయిన్ల ఆప్షన్ లే తక్కువ వున్నాయి. దాంతో అవకాశం వున్నవారంతా రేటు పెంచుకుంటూ పోతున్నారు.
పూజా హెగ్డే కూడా తక్కువేమీ కాదు. సినిమా సినిమాకు రేటు మారుతోంది. ప్రస్తుతం పూజా హెగ్డే రెమ్యూనిరేషన్ అయిదు కోట్లకు చేరుకుంది. పూరి జగన్నాధ్ లేటెస్ట్ సినిమాకు ఆమెకు ఇచ్చిన రెమ్యూనిరేషన్ ఇదే అని తెలుస్తోంది.
ఇందులో నాలుగు కోట్లు పూజా రెమ్యూనిరేషన్, మరో కోటి రూపాయలు ఆమె పర్సనల్ స్టాఫ్ ఖర్చులు. ప్రస్తుతానికి పూజా చేతిలో త్రివిక్రమ్-మహేష్ సినిమా మాత్రమే వుంది. అది కూడా కాస్త అటు ఇటు ఊగుతోందని గ్యాసిప్ వుంది. అలాగే పవన్-హరీష్ శంకర్ సినిమా వుంది. అది ఎప్పుడు ప్రారంభం అవుతుందో ఎవరికీ క్లారిటీ లేదు. ఇవి కాక హిందీలో రెండు సినిమాలు వున్నాయి.
తెలుగులో కొత్తగా మరిన్ని సినిమాలు వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఆల్ మోస్ట్ ఆల్ హీరోస్ పూజాతో సినిమాలు చేసేసారు. మిడ్ రేంజ్ హీరోల సినిమాలకు ఆమెను ఎఫెర్ట్ చేయలేరు. అందువల్ల పూజా దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టకుంటున్నట్లు కనిపిస్తోంది.