దర్శకుడు త్రివిక్రమ్ కు సమంత తరువాత అంతలా నచ్చిన హీరోయిన్ ఎవరు అంటే పూజా హెగ్డేనే. వరుసగా ఆమెను హీరోయిన్ గా తీసుకుంటూనే వున్నారు. మహేష్ ను ఒప్పించి మరీ ఇప్పుడు లేటెస్ట్ సినిమాలోకి తీసుకున్నారు. తరువాత చేయబోయే అల్లు అర్జున్ సినిమాలో కూడా పూజానే హీరోయిన్ అన్న టాక్ వుంది.
ఈ సంగతులు ఇలా వుంచితే పూజా మరి కొన్ని రోజుల్లో సెట్ లో అడుగుపెట్టబోతోంది. మహేష్ తో త్రివిక్రమ్ చేస్తున్న సినిమా ఇప్పటికి ఓ చిన్న షెడ్యూలు జరిగింది. మరో పెద్ద షెడ్యూలు ప్రారంభం కాబోతోంది. ఈ షెడ్యూలు నుంచి పూజా జాయిన్ అవుతుంది.
అందుకోసం ఏకంగా ఓ కొత్త కారే కొంటోంది యూనిట్. ఈ సినిమా షూట్ ఉన్నన్నాళ్ళు పూజా ప్రత్యేకంగా వాడుకోవడం కోసం అన్నమాట. వాస్తవానికి ఏదో ఒక మంచి కారు చూసి ఇస్తారు. కానీ పూజా కాబట్టి కొత్త కారు కొంటున్నారేమో?. ఇన్నోవా నుంచి వస్తున్న కొత్త మోడల్ కారును పూజా కోసం ఏర్పాటు చేస్తోంది యూనిట్. సాధారణంగా హీరోల కోసం ఇలాంటి ఏర్పాట్లు చేస్తుంటారు. కానీ పూజా కు వున్న ప్రయారిటీ అలాంటిది అన్నమాట.
ఎలాగూ ఓ కారు అద్దెకు తీసుకుని అరేంజ్ చేయాలి. దానికి అయినా ఖర్చు అవుతుంది. దానికి బదులు కొత్తది కొని ఇస్తే ప్రయారిటీ ఇచ్చినట్లుంటుంది. సినిమా ఖర్చులో కలుస్తుంది. పూజా ఫుల్ ఖుషీ అవుతుంది. అంతే కదా.