బిగ్ ట్విస్ట్.. పూన‌మ్ పాండే చ‌నిపోలేదు!

నిన్న మీడియా మొత్తం పూనమ్ పాండే చనిపోయిందని ఆమె చుట్టే వార్త‌లు వండింది. సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న అభిమానులు త‌మ సంతాపం వ్య‌క్తం చేస్తూ పోస్ట్‌లు పెట్టారు. తీరా ఇవాళ అందరికీ షాక్…

నిన్న మీడియా మొత్తం పూనమ్ పాండే చనిపోయిందని ఆమె చుట్టే వార్త‌లు వండింది. సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న అభిమానులు త‌మ సంతాపం వ్య‌క్తం చేస్తూ పోస్ట్‌లు పెట్టారు. తీరా ఇవాళ అందరికీ షాక్ ఇస్తూ తాను బతికే ఉన్నానంటూ వీడియో రిలీజ్ చేసింది. తాను చనిపోయినట్లు ఫేక్ ప్రచారం చేశారని వాపోయింది. గ‌తంలో సర్వైకల్ క్యాన్సర్ పై అవగాహన కోసం మాత్ర‌మే వీడియో చేసినట్లు ప్ర‌క‌టించారు.

కాగా నిన్న పూన‌మ్ మేనేజ‌ర్ సోష‌ల్ మీడియా వేదిక‌గా కొన్నాళ్లుగా పూనమ్ సర్వైకల్ క్యాన్సర్ తో బాధపడుతోందని. అయితే ఆ విషయాన్ని ఆమె గుర్తించలేకపోయిందని.. చివరి స్టేజ్ లో తెలుసుకున్న‌.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అందుకే పూనమ్ పాండే కన్నుమూసినట్టు ప్రకటించాడు. 

మోడల్ నుంచి నటిగా మారిన పూన‌మ్‌, 2013లో వచ్చిన నషా అనే సినిమాతో హీరోయిన్ గా మారింది. శృంగార తారగా బాలీవుడ్ లో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. దానికి తగ్గట్టే ఆమె హాట్ హాట్ పోజులతో పాటు, హాట్ కామెంట్స్ తో కూడా వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. టీమిండియా ప్రపంచకప్ గెలిస్తే అన్నీ విప్పేసి చూపిస్తానంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది ఈమెనే.