హాట్ బ్యూటీ, శృంగార నటి పూనమ్ పాండే కన్నుమూసింది. ఆమె సోషల్ మీడియా పేజీలో ఈ పోస్ట్ దర్శనమిచ్చింది. దీంతో చాలామంది ఇది ఫేక్ అనుకున్నారు. కొంతమంది ఎకౌంట్ హ్యాక్ అయిందనుకున్నారు. మరికొంతమంది ఇదేదో పబ్లిసిటీ జిమ్మిక్ అనుకున్నారు. కానీ పూనమ్ పాండే నిజంగానే మృతి చెందింది. ఆమె వయసు 32 ఏళ్లు.
కొన్నాళ్లుగా సెర్వికల్ కాన్సర్ తో బాధపడుతోంది పూనమ్. అయితే ఆ విషయాన్ని ఆమె గుర్తించలేకపోయింది. చివరి స్టేజ్ లో తెలుసుకుంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పూనమ్ పాండే కన్నుమూసినట్టు, ఆమె మేనేజర్ స్వయంగా ప్రకటించాడు.
పూనమ్ పాండే మృతి పట్ల చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే, 3 రోజుల కిందట కూడా గోవాలో జరిగిన ఓ పార్టీలో ఆమె హుషారుగా పాల్గొంది. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియో కూడా పోస్ట్ చేసింది. అంతలోనే ఇలా జరగడంతో చాలామంది ఆశ్చర్యపోతున్నారు.
శృంగార తారగా బాలీవుడ్ లో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది పూనమ్ పాండే. మోడల్ నుంచి నటిగా మారిన ఈమె, 2013లో వచ్చిన నషా అనే సినిమాతో హీరోయిన్ గా మారింది. ఓ స్టూడెంట్ తో రిలేషన్ షిప్ పెట్టుకునే టీచర్ పాత్రలో ఆమె కనిపించి వివాదాస్పదమైంది. అప్పట్నుంచి ఆమెకు శృంగార తార ఇమేజ్ వచ్చింది.
అందుకు తగ్గట్టే ఆమె హాట్ హాట్ పోజులతో పాటు, హాట్ కామెంట్స్ తో కూడా వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. టీమిండియా ప్రపంచకప్ గెలిస్తే అన్నీ విప్పేసి చూపిస్తానంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది ఈమెనే.
కరోనా టైమ్ లో తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ శామ్ బాంబేను పెళ్లాడింది పూనమ్. పెళ్లయిన 2 రోజులకే తన భర్తపై పోలీసు కేసు పెట్టింది. తనను వేధిస్తున్నాడంటూ అతడిపై కేసు పెట్టి, ఆ తర్వాత మళ్లీ కలిసిపోయింది. కొన్నాళ్లకు మళ్లీ విడిపోయింది. తను సింగిల్ గానే ఉన్నానంటూ రీసెంట్ గా ప్రకటించిన పూనమ్, ఇలా కాన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోయింది.