Advertisement

Advertisement


Home > Movies - Movie News

అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు.. మళ్లీ వాయిదా

అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు.. మళ్లీ వాయిదా

వర్మ సమర్పిస్తున్న అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమా మరోసారి వాయిదాపడింది. దాదాపు 3 రోజులుగా వర్మ ఊదరగొడుతున్నట్టు ఈ సినిమా రేపు రిలీజ్ కావడం లేదు. ఈ మేరకు సినిమా విడుదలకు మరోసారి హైకోర్టు బ్రేక్ వేసింది. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే.. ఈ సినిమాకు ఇంకా సెన్సార్ సర్టిఫికేట్ రాలేదు. 

సకాలంలో సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వని కారణంగా వర్మ యూనిట్ కోర్టుకెళ్లింది. ఇంకా సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వలేదని, త్వరగా సెన్సార్ అయ్యేలా ఆదేశాలు జారీచేయాలని కోర్టును కోరింది. ఈ పిటిషన్ పై సెన్సార్ బోర్డు కూడా కౌంటర్ దాఖలు చేసింది.

సినిమా యూనిట్ వినిపించిన వాదన కంటే,సెన్సార్ బోర్డు వాదనతోనే కోర్టు ఎక్కువగా ఏకీభవించింది.అభ్యంతరకర సన్నివేశాలు తొలిగించామంటూ యూనిట్ చెప్పిన మాటల్ని కోర్టు ఖండించింది.వాటిని తొలిగించలేదని, కేవలం మ్యూట్ లోనే ఉంచారని వెల్లడించింది.

ప్రాసెస్ ను తొందరగా పూర్తిచేయాలని మాత్రమే ఆదేశాలు జారీచేయగలమని, సెన్సార్ విషయంలో కోర్టు జోక్యం చేసుకోలేదని ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది కోర్టు. టైటిల్ మార్చి, సన్నివేశాలకు మ్యూట్స్ వేసినంత మాత్రాన సెన్సార్ సర్టిఫికేట్ రాదని బోర్డు కోర్టుకు తెలిపింది.

సినిమాను వీలైనంత త్వరగా రివ్యూ కమిటీ చూడాలని ఈ సందర్భంగా హైకోర్టు ఆదేశించింది. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత మాత్రమే, దాన్ని పరిశీలించి సెన్సార్ బోర్డు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.

అంతకంటే ముందు, సెన్సార్ బోర్డు వద్ద చిత్ర యూనిట్ ఆందోళనకు దిగింది. టీడీపీ నేతలు సెన్సార్ బోర్డుకు 50 లక్షల రూపాయలిచ్చి సర్టిఫికేట్ రాకుండా ఆపుతున్నారని నిర్మాత నట్టికుమార్ ఆరోపించారు. అటు సెన్సార్ బోర్డ్ ఆర్వో రాజశేఖర్ కూడా తమను 50 లక్షలు డిమాండ్ చేశారని ఆరోపించారు.

ఈ ఆరోపణల్ని రాజశేఖరన్ ఖండించారు. వ్యవహారం కోర్టులో ఉన్న కారణంగా సర్టిఫికేట్ ఇవ్వలేదన్నారు. తను 50 లక్షలు డిమాండ్ చేశారనే ఆరోపణల్లో నిజం లేదన్న రాజశేఖరన్, నిబంధనల ప్రకారమే తను నడుచుకుంటున్నట్టు స్పష్టంచేశారు. ఇటు కోర్టు తీర్పు కూడా సెన్సార్ బోర్డుకు అనుకూలంగా రావడంతో సినిమా మరోసారి వాయిదా పడింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?