వద్దంటే వాయిదా.. ఇదేదో కొత్త ట్రెండ్ కాబోలు!

సినిమా రిలీజ్ డేట్స్ ప్రకటించడం గొప్ప కాదు, చెప్పిన తేదీకి సినిమాను విడుదల చేయడం ఇప్పుడు కత్తిమీద సాముగా మారింది. చిన్న, పెద్ద తేడా లేకుండా సినిమాలు వాయిదాలు పడుతున్నాయి. చూస్తుంటే, టాలీవుడ్ లో…

సినిమా రిలీజ్ డేట్స్ ప్రకటించడం గొప్ప కాదు, చెప్పిన తేదీకి సినిమాను విడుదల చేయడం ఇప్పుడు కత్తిమీద సాముగా మారింది. చిన్న, పెద్ద తేడా లేకుండా సినిమాలు వాయిదాలు పడుతున్నాయి. చూస్తుంటే, టాలీవుడ్ లో ఇప్పుడు వాయిదాల ట్రెండ్ నడుస్తున్నట్టుంది.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, లవ్ మి, లాంటి సినిమాలు కొన్ని మాత్రమే. ఈ లిస్ట్ తీస్తే, దాదాపు ప్రతి సినిమా కనీసం ఒక్కసారైనా వాయిదా పడినట్టు కనిపిస్తుంది. ఇప్పుడీ లిస్ట్ లోకి సత్యభామ సినిమా కూడా చేరింది.

కాజల్ మెయిన్ లీడ్ లో నటించిన సత్యభామ సినిమాను 31న విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు ప్రమోషన్స్ కూడా ప్రారంభించారు. కాజల్ వరుసగా ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేసింది. అంతలోనే సినిమా వాయిదా పడింది. ఈనెల 31 నుంచి వచ్చేనెల 7కి సినిమాను పోస్ట్ పోన్ చేశారు. అయితే ట్రయిలర్ రిలీజ్ కార్యక్రమాన్ని మాత్రం రేపు యథాతథంగా నిర్వహిస్తారు.

కొన్ని రోజుల కిందట ప్రతినిధి-2 అనే సినిమా కూడా ఇదే విధంగా వాయిదా పడింది. పూర్తిస్థాయిలో ప్రచారం కూడా చేసిన తర్వాత సినిమాను వారం రోజులు విడుదల చేశారు. ఇక లవ్ మి సినిమాను కూడా పలు మార్లు వాయిదా వేసి ఈ వీకెండ్ థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బెటర్. ఈమధ్య కాలంలో ఇన్నిసార్లు ఏ సినిమా వాయిదా పడలేదు. ఇలా టాలీవుడ్ లో సినిమాలన్నీ వాయిదా పడుతున్నాయి.