చాలా తక్కువ టైమ్ మాత్రమే సింగిల్ స్టేటస్ మెయింటైన్ చేస్తుంది శృతిహాసన్. ఎప్పటికప్పుడు ఆమె ప్రేమలో పడుతుంది, బ్రేకప్స్ అవుతూనే ఉంటాయి. ఈ విషయాల్ని ఓపెన్ గా చెప్పడానికి కూడా ఈ ముద్దుగుమ్మ మొహమాట పడదు.
తాజాగా ఈమె మరోసారి సింగిల్ అయింది. ఇన్నాళ్లూ డేటింగ్ చేసిన శంతను హజారికాకు గుడ్ బై చెప్పేసింది. దాదాపు నాలుగేళ్లు వీళ్లు డేటింగ్ చేసి, విడిపోయింది ఈ జంట. ముంబయిలో ఇద్దరూ కలిసి ఒకే ఫ్లాట్ లో ఉండేవారు.
తామిద్దరం విడిపోయిన విషయాన్ని శృతిహాసన్ కన్ ఫర్మ్ చేసింది. ప్రస్తుతం తను పూర్తిగా సింగిల్ గా ఉన్నానని ప్రకటించింది. అదే టైమ్ లో మరొకరితో మింగిల్ అయ్యే ఆసక్తి లేదని కూడా తెలిపింది.
“ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటప్పుడు పెద్దగా ఎంజాయ్ చేయలేను. అయినప్పటికీ చెబుతున్నాను, నేను పూర్తిగా సింగిల్, ప్రస్తుతానికి మింగిల్ అవ్వడానికి సిద్ధంగా లేను. నా పనిని మాత్రమే ఎంజాయ్ చేస్తున్నాను. ఈ సమాధానం చాలా?”
ప్రస్తుతం తన మనసుకు దగ్గరైన స్నేహితులు ఎవ్వరూ లేరని అంటోంది శృతి. తనకు తానే బెస్ట్ ఫ్రెండ్ అని చెబుతోంది.