పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- సాయి ధరమ్ తేజ్-సముద్రఖని కాంబినేషన్ త్రివిక్రమ్ స్క్రిప్ట్ తో వస్తోంది ‘బ్రో’ సినిమా. జూలై నెలాఖరులో విడుదలయ్యే ఈ సినిమాకు నిర్మాత పీపుల్స్ మీడియా.
తమిళ సినిమా ఆధారంగా తయారవుతున్న ఈ సినిమా టీజర్ ను విడుదల చేసారు. తమిళ సినిమా ‘వినోదయసితం’ ను గురూజీ త్రివిక్రమ్ పూర్తి ఎంటర్ టైనర్ గా మార్చేసారని టీజర్ చూడగానే అర్థం అయిపోతోంది.
సినిమాలో దేవుడి పాత్రను చేస్తున్నారు పవన్ కళ్యాణ్. దాన్ని పూర్తిగా పవన్ ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకుని మొత్తానికి మార్చేసారు. గతంలో పవన్ చేసిన సినిమాల గెటప్ లు, చమక్కులు జోడించారు. కాలం ఎవరి కోసం ఆగదు.. అలా ఆగితే అనే మెయిన్ కాన్సెప్ట్ ను లైట్ గా టీజర్ లో టచ్ చేసారు.
దాని కన్నా కేవలం ఎంటర్ టైన్ మెంట్ అన్న దాని మీదే వెళ్లారు. దీనికి తోడు జనసేన వ్యవహారాలు అన్నీ సింబాలిక్ గా భలే సెట్ చేసారు పవన్ సన్నిహితుడు, స్నేహితుడు త్రివిక్రమ్. క్రియేటర్ తలుచుకుంటే సినిమాను రాజకీయాలకు ఇలా వాడుకోగలరేమో?
థమన్ బ్యాక్ గ్రవుండ్ స్కోర్ బాగుంది. టీజర్ మొత్తం మీద పవన్..సాయి ధరమ్ తేజ్ ఇద్దరే కనిపించారు.