షూటింగ్ షూటింగ్ కు మధ్య గ్యాప్ ల్లో ఓ చిన్న సైజు సినిమా కొట్టేద్దాం అనే ఆలోచనతో మొదలైంది ప్రభాస్- నిర్మాత దానయ్య సినిమా, కానీ ఎప్పుడు అవుతుంది..ఎప్పుడు చేస్తారు అన్నది మాత్రం క్లారిటీ లేదు. దాంతో దానయ్య తనకు వద్దు అనేసారు. దాంతో తీసుకున్న భారీ అడ్వాన్స్ వెనక్కు ఇవ్వాల్సి వచ్చింది. ఎవరికి కావాలీ ఈ ప్రాజెక్టు అంటూ ప్రభాస్ సన్నిహితుడు వంశీ గాలింపు ప్రారంభిస్తే అభిషేక్ అగర్వాల్..ఆసియన్ సునీల్ మీదుగా వెళ్లి వెళ్లి పీపుల్స్ మీడియా దగ్గర ఆగింది. భారీ మొత్తం సింగిల్ పేమెంట్ ఇచ్చి ప్రాజెక్టును టేకోవర్ చేసారు.
మొత్తానికి ఓ షెడ్యూలు కంప్లీట్ చేసారు. అదే షెడ్యూలు లో కూడా స్వంత పని మీద ఓ రోజు, అనీజీ గా వుందని ఓ రోజు ప్రభాస్ షూటింగ్ చేయలేదు. మలి షెడ్యూలు ఎప్పుడు అనే దాని మీద రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. మలి షెడ్యూలు ఇప్పట్లో వుంటుందా అన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి.
ప్రాజెక్ట్ కే విడుదలకు డెడ్ లైన్ పెట్టుకున్నారు. సలార్ విడుదలకు కూడా డెడ్ లైన్ పెట్టుకున్నారు. ఈ రెండూ ముందుగా పూర్తి చేసి తీరాల్సిందే. తన సినిమా విడుదల కాకుండా హర్రర్ సినిమా విడుదల చేస్తే కుదరదని ప్రాజెక్ట్ కె నిర్మాత అశ్వనీదత్ ఓపెన్ గానే ప్రభాస్ కు చెప్పేసారని టాలీవుడ్ లో వార్తలు వున్నాయి. అందువల్ల ఈ హర్రర్ సినిమాకు 2024 సమ్మర్ వరకు టైమ్ వుందని తెలుస్తోంది.
ఇలాంటి నేపథ్యంలో మైత్రీ నిర్మించే ప్రభాస్-హృతిక్ రోషన్ మల్టీ స్టారర్ తెరపైకి వచ్చింది. ఈ ఏడాది దీనికి శ్రీకారం చుట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరో పక్కన నిర్మాత దిల్ రాజు తను ఎప్పుడో ఇచ్చిన అడ్వాన్స్ ను గుర్తు చేస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే అన్ని ప్రాజెక్టుల కన్నా చిన్న ప్రాజెక్టు, పెద్దగా కాంబినేషన్ లేని ప్రాజెక్ట్ గా పీపుల్స్ మీడియా సినిమానే కనిపిస్తోంది.
ప్రాజెక్ట్ కె. ఆదిపురుష్, సలార్ (రెండు భాగాలు), మైత్రీ హిందీ సినిమా, దిల్ రాజు సినిమా, వీటన్నింటి మధ్య గ్యాప్ ల్లో పీపుల్స్ మీడియా సినిమాను అడపాదడపా షూట్ చేయడం ఏ మేరకు సాధ్యం అవుతుంది అన్నదే అసలు సిసలు ప్రశ్న. ఊరికే వదులుకుని వుంటారా? నిర్మాత దానయ్య ఈ ప్రాజెక్ట్ ను.