ప్రభాస్-మారుతి సినిమా ఆరంభమే ఓ సంచలనం. పైగా ఇప్పటి వరకు ఈ సినిమా అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ లేదు. పూజ జరిపారని వార్తలు వినిపించాయి తప్ప, అధికారికంగా ఆ విషయం కూడా ప్రకటించలేదు. చాలా సైలంట్ గా షూటింగ్ మాత్రం అవకాశం కుదిరినపుడల్లా చేసుకుంటూ వెళ్తున్నారు.
సినిమా మీద ఆరంభం వార్తలు వచ్చినపుడే ఈ సినిమాకు టైటిల్ కూడా వినిపించింది. రాజా డీలక్స్ అనే టైటిల్ బలంగా తిరిగేసింది. సినిమాలో ఓ థియేటర్ అన్నది కీలకంగా వుంటుందని, దాని పేరు రాజా డీలక్స్ అని తెగ వినిపించింది. అయితే ఆ టైటిల్ మీద చాలా మంది పెదవి విరిచారు. దాంతో అది టైటిల్ కాదనే ప్రచారాన్ని మెల్లగా సోషల్ మీడియా లోకి పంపాల్సి వచ్చింది.
కట్ చేస్తే..ఇప్పుడు సీన్ మారింది. కొత్త టైటిల్ వినిపిస్తోంది. అదే…అంబాసిడర్. సినిమాలో ఓ కారు కూడా కీలకంగా వుంటుందని, అందుకే సినిమాకు అంబాసిడర్ అనే టైటిల్ ను దర్శకుడు మారుతి పరిళీలిస్తున్నారని వినిపిస్తోంది. మరి ఇంతకీ దీని మీద ఫ్యాన్స్ ఏమంటారో చూడాలి. ఎందుకంటే దీన్ని కూడా ఫ్యాన్స్ నచ్చక, ఓ లెక్కలో వేసుకున్నారంటే, కాదు…వేరే టైటిల్ వుంది అని ఫీలర్లు వదలాల్సి వుంటుంది.
మొత్తం మీద ఓ అనౌన్స్ మెంట్, వర్కింగ్ టైటిల్ లేకుండానే ప్రభాస్ లాంటి పెద్ద హీరో సినిమా రెడీ చేయడం అంటే రికార్డే.