అక్కడ ప్రభాస్ క్రేజ్ మామూలుగా లేదుగా

జపాన్ కు టాలీవుడ్ కు కనెక్షన్ తక్కువ. మన స్టార్ హీరోల సినిమాలు జపాన్ లో పెద్దగా ఆడవు. అయితే సౌత్ నుంచి రజనీకాంత్ కు మాత్రం అక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక్కడ…

జపాన్ కు టాలీవుడ్ కు కనెక్షన్ తక్కువ. మన స్టార్ హీరోల సినిమాలు జపాన్ లో పెద్దగా ఆడవు. అయితే సౌత్ నుంచి రజనీకాంత్ కు మాత్రం అక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక్కడ టాక్ తో సంబంధం లేకుండా అక్కడ రజనీకాంత్ సినిమాలు ఆడతాయి. ఇన్నేళ్లకు రజనీకాంత్ తర్వాత మరో సౌత్ స్టార్ కు జపనీయులు పట్టం కట్టారు. అతడే ప్రభాస్.

ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా జపాన్ లో సూపర్ డూపర్ హిట్టయింది. ఈ సినిమాతో ప్రభాస్ కు అక్కడ ఫ్యాన్ గ్రూపులు కూడా ఏర్పడ్డాయి. మన హీరోను చూసేందుకు బాహుబలి అభిమానులు జపాన్ నుంచి హైదరాబాద్ వచ్చిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. అలా ఊహించని విధంగా జపాన్ లో క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్, ఇప్పుడు సాహో సినిమాతో కూడా వాళ్లను పలకరించాడు.

జపాన్ వాసులు బాహుబలికి మాత్రమే అభిమానులని, ప్రభాస్ కు కాదని కొంతమంది యాంటీఫ్యాన్స్ మొన్నటివరకు ప్రచారం చేస్తూ వచ్చారు. అది తప్పని సాహోతో తేలిపోయింది. లిమిటెడ్ థియేటర్లలో జపనీస్ సబ్ టైటిల్స్ తో విడుదలైన సాహో సినిమాకు అక్కడ మంచి ఆదరణ లభిస్తోంది. కేవలం ప్రభాస్ కోసమే సాహో సినిమాకు వెళ్తున్నారనేది వాస్తవం.

తెలుగు రాష్ట్రాల్లో సాహో సినిమా ఫ్లాప్ అయింది. నార్త్ లో మాత్రం ఇది సక్సెస్ ఫుల్ మూవీగా నిలిచింది. రీసెంట్ గా జీ సినిమా హిందీ ఛానెల్ లో ఈ సినిమాను ప్రసారం చేశారు. తెలుగు శాటిలైట్ రైట్స్ మాత్రం ఇంకా అమ్ముడుపోలేదు.

నిర్మాతగా మంచి సినిమానే తీశాను అనుకుంటున్నాను