Advertisement

Advertisement


Home > Movies - Movie News

సెక్సీ హీరో.. టాప్-10 లిస్ట్ లో ప్రభాస్

సెక్సీ హీరో.. టాప్-10 లిస్ట్ లో ప్రభాస్

ఆసియాలో ఈ ఏడాది సెక్సీ పురుషుల్లో ఒకడిగా నిలిచాడు ప్రభాస్. ఆన్ లైన్ లో నిర్వహించిన ఓ పోల్ ను లండన్ లో విడుదల చేశారు. ఈ లిస్ట్ లో టాప్-10లో నిలిచాడు ప్రభాస్. సౌత్ నుంచి మరే హీరోకు ఈ లిస్ట్ లో చోటు దక్కకపోవడం గమనించదగ్గ విషయం.

బ్రిటన్ కు చెందిన ఈస్టర్న్ ఐ అనే వార్తాసంస్థ ఆన్ లైన్ లో ఈ పోల్ నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల ఓట్లతో పాటు.. సోషల్ మీడియాలో వేడి పెంచుతూ, ఈ ఏడాది ఎక్కువ ప్రభావం చూపిన హీరోలతో జాబితా తయారుచేసింది. ఇందులో టాప్ లో హృతిక్ రోషన్ నిలిచాడు.

బాహుబలి ఫ్రాంచైజీతో ఇండియన్ స్టార్ గా అవతరించాడు ప్రభాస్. సాహో సినిమాతో బాలీవుడ్ లో తన సత్తా చాటాడు. దీనికితోడు సోషల్ మీడియాలో ఈ ఏడాది ఎక్కువ బజ్ కలిగిన హీరో కూడా ఇతడే. ఇవన్నీ ఒకెత్తయితే.. బ్యాంకాక్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువుదీరిన మొట్టమొదటి సౌతిండియన్ స్టార్ కూడా ప్రభాసే.

ఈ అంశాలన్నీ కలిసి ప్రభాస్ ను మోస్ట్ సెక్సీయస్ట్ ఏషియన్ మెన్ జాబితాలో చోటు దక్కేలా చేశాయి. ప్రస్తుతం ప్రభాస్ జాన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ కూడా హిందీలో రిలీజ్ అవుతోంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?