43 ఏళ్ల ప్రభాస్ తనకు పెళ్లి ఇంకా రాసిపెట్టిలేదని అంటున్నాడు. బాలయ్యతో చేసిన చిట్ చాట్ లో మాట్లాడిన ఈ హీరో, పెళ్లిపై మరోసారి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
“పెళ్లి చేసుకుంటాను. కాకపోతే నాకు ఇంకా రాసిపెట్టిలేదు. ఇంట్లో ఎప్పుడూ అడుగుతుంటారు. మా సిస్టర్, వదిన ఇంటి దగ్గర్లోనే ఉంటారు. వాళ్లతో ప్రస్తుతానికే పెళ్లి టాపిక్ రాకుండా మేనేజ్ చేస్తున్నాను. అయినా పెళ్లి అనేది రాసిపెట్టి ఉండాలి. అది నా చేతిలో లేదు. నేనేం ఒంటరిగా మిగిలిపోవాలని అనుకోవడం లేదు. ఆ టైమ్ వచ్చినప్పుడు పెళ్లవుతుంది. ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు.”
ఇలా తన పెళ్లిపై స్పందించాడు ప్రభాస్. ఆమధ్య ఇదే కార్యక్రమంలో పాల్గొన్న శర్వానంద్, ప్రభాస్ పెళ్లి చేసుకున్న తర్వాత తను చేసుకుంటానని చెప్పాడు. దీనికి కౌంటర్ గా సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకున్న తర్వాత తను చేసుకుంటానంటూ ప్రభాస్ జోక్ చేశాడు.
రీసెంట్ గా కృతి సనన్ తో ప్రభాస్ డేటింగ్ చేస్తున్నాడంటూ పుకార్లు వచ్చాయి. వీటిపై కూడా ప్రభాస్ క్లారిటీ ఇచ్చాడు. తామిద్దరం మంచి స్నేహితులమని, ఇదే విషయంపై కృతి ఇప్పటికే క్లారిటీ ఇచ్చిందని చెప్పుకొచ్చాడు.