Advertisement

Advertisement


Home > Movies - Movie News

ప్రభాస్ సిక్స్ ప్యాక్ మళ్లీ ఎప్పుడు?

ప్రభాస్ సిక్స్ ప్యాక్ మళ్లీ ఎప్పుడు?

అప్పుడెప్పుడో వచ్చిన బాహుబలి సినిమాలో ప్రభాస్ కండలు చూశారు ప్రేక్షకులు. మరీ ముఖ్యంగా బాహుబలి-2 క్లైమాక్స్ లో ప్రభాస్ ఫిజిక్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఆ తర్వాత సాహోలో ఓ సీన్ లో కనిపించాడు. ఆ సంగతి పక్కనపెడితే.. మళ్లీ ప్రభాస్ ఎప్పుడు తన కండలు, సిక్స్ ప్యాక్ బాడీ చూపించబోతున్నాడు. దీనికి సమాధానం సలార్.

అవును.. సలార్ సినిమా కోసం ప్రభాస్ మరోసారి కసరత్తులు మొదలుపెట్టబోతున్నాడు. సినిమాకు అత్యంత కీలకమైన ఓ యాక్షన్ ఎపిసోడ్ లో ప్రభాస్ షర్ట్ లేకుండా కనిపించబోతున్నాడు. తన సిక్స్ ప్యాక్ బాడీని చూపించబోతున్నాడు. దీని కోసం త్వరలోనే ప్రభాస్ ప్రిపేర్ అవ్వబోతున్నాడు.

కంప్లీట్ యాక్షన్ మూవీగా రాబోతోంది సలార్. ఇందులో గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నాడు ప్రభాస్. ఈ క్యారెక్టర్ కు సంబంధించిన లుక్ ఇప్పటికే బయటకొచ్చింది. అయితే దానికి పూర్తి భిన్నమైన లుక్ ఒకటి సినిమాలో ఉంది. అది ఈ సిక్స్ ప్యాక్ లుక్ అంటున్నారు యూనిట్ జనాలు.

శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ చేయబోతున్నారు. లాక్ డౌన్ వల్ల షూటింగ్ ఆలస్యమౌతున్నప్పటికీ.. చెప్పిన టైమ్ కు సినిమాను రెడీ చేస్తానంటున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. మరో నెల రోజులు షూటింగ్ ఆలస్యమైనప్పటికీ.. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి సలార్ షూటింగ్ మొత్తం పూర్తవుతుందని చెబుతున్నాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?