అమ్మో అంటున్న జనం…?

విశాఖ పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన నగరం. విశాఖలో ఎటు చూసినా ప్రభుత్వ ప్రైవేట్ రంగంలోని అనేక పరిశ్రమలు కనిపిస్తాయి. అదే విశాఖ ప్రగతికి కూడా ప్రధాన కారణం. మరో వైపు చూస్తే విశాఖ చుట్టూ…

విశాఖ పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన నగరం. విశాఖలో ఎటు చూసినా ప్రభుత్వ ప్రైవేట్ రంగంలోని అనేక పరిశ్రమలు కనిపిస్తాయి. అదే విశాఖ ప్రగతికి కూడా ప్రధాన కారణం. మరో వైపు చూస్తే విశాఖ చుట్టూ ఉన్న కొన్ని పరిశ్రమలు భద్రత దృష్ట్యా ఇబ్బందికరంగా మారుతున్నాయి. 

ఆయన ప్రైవేట్ పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు ఎంతమేరకు పాటిస్తున్నారో ఎవరికీ తెలియదు కానీ అక్కడ పొరపాటున గ్యాస్ లీక్ అయితే మాత్రం సమీపంలోని ప్రాంతాలకు పెను ముప్పే అన్న సీన్ ఉంది.

ఏడాది క్రితం గోపాలపట్నం వద్ద ఎల్జీ పాలిమార్స్ పరిశ్రమలో గ్యాస్ లీక్ అయి 15 మంది దాకా మరణించిన సంగతి విధితమే. ఆ ఘటనను తలచుకున్నపుడుల్లా జనం భయభ్రాంతులకు లోను అవుతారు. 

ఇక తాజాగా పరవాడ వద్ద ఒక కర్మాగారంలో అమ్మోనియం గ్యాస్ కొంత లీక్ అయింది. దాంతో  చుట్టుపక్కల జనాలు బెంబేలెత్తారు. సాంకేతికంగా గా జరిగిన పొరపాటుగా ఇది చెబుతున్నా జనాల్లో మాత్రం  భయాలు ఎక్కడా తగ్గడంలేదు.

బయట పెద్ద ఎత్తున అమ్మోనియం నిల్వలు ఉండరాదు అని కచ్చితమైన ఆదేశాలు ఉన్నా బేఖాతరు చేస్తూ కొందరు ప్రైవేట్ కర్మాగారం యాజమాన్యాలు చేస్తున్న చర్యల వల్లనే విశాఖలో ఇప్పటికీ  అమ్మో అనుకునే పరిస్థితి ఉంది అంటున్నారు.