Advertisement

Advertisement


Home > Movies - Movie News

సీనియ‌ర్ న‌టి ఆ ప‌నికి అభిమానుల‌ అవాక్కు

సీనియ‌ర్ న‌టి ఆ ప‌నికి అభిమానుల‌ అవాక్కు

లాక్‌డౌన్ వేళ‌లో సినీ సెల‌బ్రిటీలు త‌మ‌లోని టాలెంట్‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా బ‌య‌ట పెడుతున్నారు. ఒక్కొక్క‌రు ఒక్కో ర‌కంగా త‌మ సృజ‌నాత్మ‌క‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. సినీ సెల‌బ్రిటీల ప్ర‌ద‌ర్శ‌న‌ల్లో వైవిధ్యం క‌నిపిస్తోంది. త‌న అభిమానుల్ని అవాక్కుకు గురి చేసిన ఓ సీనియ‌ర్ న‌టి గురించి మ‌నం చెప్పుకోవాల్సిందే.

తెలుగు ప్రేక్ష‌కుల‌కి సీనియ‌ర్ న‌టి ప్ర‌గ‌తిని ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. అనేక ర‌కాల పాత్ర‌ల్లో ఆమె న‌టించి, అభిమానుల్ని మెప్పించారు. అమ్మ‌గా, పిన్నిగా, వ‌దిన‌గా ఇలా అనేక ర‌కాల వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌ల్లో ఆమె తెలుగు,  త‌మిళ చిత్రాల్లో న‌టించి త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

తాజాగా ఆమె సోష‌ల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉన్నారు. ఇటీవ‌ల ఆమె విజ‌య్ మాస్ట‌ర్ సినిమా పాట‌కు లుంగీలో తీన్మార్ స్టెప్పులేసి ఇర‌గ‌దీశార‌నిపించుకున్నారు. ప్ర‌గ‌తి స్టెప్పుల వీడియో సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

ప్ర‌స్తుతానికి వ‌స్తే మ‌రో వీడియో కూడా వైర‌ల్‌గా మారింది. మ్యూజిక్‌కి త‌గ్గ‌ట్టు న‌డుముని సుతారంగా తిప్పుతూ యూత్‌ని ఆక‌ట్టుకుంటున్నారామె. 44 ఏళ్ల వ‌య‌సులో శ‌రీరాన్ని ఇంత నాజూగ్గా, ల‌య‌బ‌ద్ధంగా తిప్ప‌డాన్ని చూసిన అభిమానులు అవాక్క‌వుతున్నారు. ఇదెలా సాధ్య‌మ‌ని ఆశ్చ‌ర్య‌పోతున్నారు.  

కేసీఆర్ ప్లాన్ బాలయ్యకు ముందే తెలుసా

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?